/rtv/media/media_files/2026/03/07/surya-kumar-yadav-2026-03-07-18-18-20.jpg)
Surya Kumar Yadav
టీ20 ప్రపంచ కప్(t20-world-cup) ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్(Ahamadabad) వేదికగా మార్చి 8న భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే ఈ ఫైనల్స్ మ్యాచ్ వేళ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. టీమిండియా గెలిచినా, ఓడిపోయినా తన కెరీర్‌కు ఎండ్ కార్డు పలకాలని సూర్య కుమార్ యాదవ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం కేవలం టీ20 ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. గతంలో వన్డే జట్టులో అవకాశం దక్కింది. కానీ 2023 ప్రపంచ కప్ ఫైనల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో ఆ ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు పగ్గాలు సూర్యకుమార్ యాదవ్ అందుకున్నారు. అప్పటి నుంచి కెప్టెన్ సూర్య నాయకత్వంలో టీమిండియా వరుస విజయాలు అందుకుంది.
ఇది కూడా చూడండి: Ind Vs Eng: హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
SURYAKUMAR YADAV LIKELY TO ANNOUNCE RETIREMENT FROM INTERNATIONAL CRICKET ??
— Lepchas (@Lepchas_) March 6, 2026
According to reliable sources, SKY is likely to announce his retirement from international cricket after this T20 WC #INDvsNZ Final on Sunday. He does not play Test cricket, and it has become difficult… pic.twitter.com/Nw4lhzNwEL
ఇది కూడా చూడండి: Pakistan Player Misbehave: నీ కామం తగలెయ్య.. మహిళా హౌస్ కీపింగ్‌తో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!
తర్వాత ప్రపంచ కప్‌కు..
సొంతగడ్డపై జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పవచ్చు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ శర్మల సరసన చేరుతాడు. దేశానికి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలుస్తాడు. కాబట్టి సూర్య కుమార్ యాదవ్ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కప్పు గెలిచి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇంతకంటే గొప్ప వీడ్కోలు మరొకటి లేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం కెప్టెన్ సూర్య ఫామ్‌లో లేడు. కెప్టెన్‌గా ఆడిన 41 మ్యాచ్‌లలో అతని సగటు 26కు పడిపోయింది. ఈ మెగా టోర్నీలో కూడా అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 84 పరుగులు చేసిన సూర్య.. ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. జట్టు గెలుస్తున్నా, బ్యాటర్‌గా సూర్య తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: Ind Vs Eng: చుక్కలు చూపించిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
ఒకవేళ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినా తప్పకుండా తన కెరీర్‌కు ముగింపు ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలోనే తానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే తర్వాత ప్రపంచ కప్‌కు కుర్రాళ్లతో జట్టును సిద్ధం చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే ప్రపంచ కప్ జట్టులో సూర్యకు చోటు దక్కడం కూడా కష్టమే. కాబట్టి ముందుగానే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ జరిగిన తర్వాత దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Follow Us