Pakistan: పాకిస్తాన్ క్రికెట్‌లో న్యూ స్కామ్.. అవినీతి ఉందంటూ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!

పాకిస్తాన్ ఆటగాళ్లకు చాలా తక్కువ నాణ్యత గల జెర్సీలను ఇచ్చారని, అసలు బాలేదని మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ అన్నారు. ఆడేటప్పుడు ప్లేయర్స్ తడిస్తే అవినీతి కారిపోతోందని మాజీ క్రికెటర్ ఆరోపించారు. చెమట కంటే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని అతీక్ విమర్శించారు.

New Update
Pakistan

Pakistan jersy quality

ఆసియా కప్ 2025లో పాక్ జట్టుకు భారత్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. పాక్  జట్లు జెర్సీలు నాణ్యత లేవని ఓ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే జెర్సీ వివాదం ఏంటంటే.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అతీక్-ఉజ్-జమాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. పీసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు చాలా తక్కువ నాణ్యత గల జెర్సీలను ఇచ్చారని, అసలు బాలేదని అన్నారు. ఆడేటప్పుడు ప్లేయర్స్ తడిస్తే అవినీతి కారిపోతోందని మాజీ క్రికెటర్ ఆరోపించారు.

ఇది కూడా చూడండి: Pakistan: భారత్ పై అక్కసుతో పాక్ బలుపు ప్రదర్శన..శిక్ష తప్పదంటోన్న ఐసీసీ

ఇది కూడా చూడండి: Ind vs Pak: భారత్‌పై మరోసారి కుట్రకు పాల్పడ్డ పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచే సత్తా లేక సాకులు వెతుక్కున్న పీసీబీ

ఆటగాళ్లకు అసౌకర్యంగా ఉందని..

టెండర్లు నిపుణులకు ఇవ్వకుండా వారి స్నేహితులకు ఇచ్చినప్పుడు జెర్సీ విషయంలో ఇలానే జరుగుతుందని అన్నారు. పాక్ ఆటగాళ్లు చెమటతో పూర్తిగా తడిసిపోతున్నారు.. ఇందులో చెమట కంటే ఎక్కువగా అవినీతి కనిపిస్తోందని అతీక్ విమర్శించారు. భారత జట్లుతో పాటు ఇతర జట్లు ఉపయోగిస్తున్నా డ్రైఫిట్ కిట్లను చూపించారు. ఈ కిట్లు త్వరగా ఆరిపోవడంతో పాటు ఆటగాళ్లకు సౌకర్యంగా ఉంటాయని తెలిపారు. మిగతా జట్లు జెర్సీలతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు జెర్సీలు తొందరగా ఆరిపోవడం లేదని, అసౌకర్యంగా ఉన్నాయని ఆరోపించారు. పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఇదో పెద్ద స్కామ్ జరుగుతున్నట్లు మాజీ క్రికెటర్ ఆరోపించడంతో ఈ వివాదం మరోసారి తీవ్రమవుతోంది. 

Advertisment
తాజా కథనాలు