Dunith Wellalage : హార్ట్ బ్రేకింగ్.. మ్యాచ్ ఆడుతుండగానే మరణవార్త

ఆసియా కప్-2025 టోర్నీలో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగే తండ్రి సురంగ వెల్లలగే తుదిశ్వాస విడిచారు.

New Update
father

ఆసియా కప్-2025(Asia cup 2025) టోర్నీలో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో విషాదకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలగే(Dunith Wellalage) తండ్రి సురంగ వెల్లలగే తుదిశ్వాస విడిచారు. అయితే మ్యాచ్ ముగిసే వరకు వెల్లలగేకు ఈ విషయం చెప్పలేదు. ఆఫ్ఘనిస్తాన్‌పై లంక గెలిచిన తర్వాత హెడ్ కోచ్ సనత్ జయసూర్య ఈ విషయాన్ని అతనికి చెప్పడంతో అతను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ కూడా వెల్లడించారు. అందుకే శ్రీలంక ఆటగాళ్లు ఆఫ్ఘనిస్తాన్‌పై విజయాన్ని వేడుక చేసుకోలేదని ఆయన తెలిపారు. దునిత్ తండ్రి సురంగ కూడా ఒకప్పుడు క్రికెటర్ అని, తమ స్కూల్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండేవారని రసెల్ పేర్కొన్నారు.  ఈ విషయం తెలియగానే  దునిత్ వెల్లలగే  స్వదేశానికి పయనం అయ్యాడు. 

Also read : TG Crime: ప్రాణం తీసిన పేకాట.. పోలీసులు రావడంతో పారిపోతుండగా హార్ట్ ఎటాక్!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే గురువారం జరిగిన చివరి గ్రూప్-దశ మ్యాచ్‌లో శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది.  అఫ్గానిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 8 వికెట్లకు గానూ 169- పరుగులు  చేసింది. అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లలో నబి(60) పరుగులు చేశాడు. ఒక దశలో అఫ్గానిస్తాన్ 6 వికెట్లకు 79 పరుగులే చేసింది, స్వల్ప స్కోరుకే అఫ్గానిస్తాన్ ఆలౌట్ అవుతుందని అంతా భావించారు. 

Also Read :  పాకిస్తాన్ క్రికెట్‌లో న్యూ స్కామ్.. అవినీతి ఉందంటూ మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు!

సునాయాసంగా ఛేజింగ్ 

కానీ కెప్టెన్ రషీద్ ఖాన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 24 పరుగులు చేయగా, మహ్మద్ నబీ 22 బంతుల్లో 6 సిక్స్ లు, 3 ఫోర్లతో అజేయంగా 60 పరుగులు చేసి జట్టును 169 పరుగులకు చేర్చాడు. శ్రీలంక  బౌలర్లలో తుషారా 4 వికెట్లతో రాణించారు. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్(74) చెలరేగడంతో 170 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. అఫ్గానిస్థాన్‌ బౌలర్లలో ముజీబ్, అజ్మతుల్లా, నబి, నూర్‌ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో శ్రీలంక గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్ 4 దశకు చేరుకోగా, ఆఫ్ఘనిస్తాన్ 3 మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

Also Read :  భారత్ పై అక్కసుతో పాక్ బలుపు ప్రదర్శన..శిక్ష తప్పదంటోన్న ఐసీసీ

Advertisment
తాజా కథనాలు