Suryakumar Yadav : ఇదెక్కడి మాస్ రా మావా... పాకిస్థాన్కు గట్టిగా ఇచ్చిపడేసిన సూర్య

విజయం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్ చేశాడు. పాక్ ను ప్రత్యర్థి అనడం మానేయాలన్నారు సూర్య. మీరు భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలి.

New Update
surya kumar yadav

ఆసియా కప్‌(Asia cup 2025) లో భారత్ పాకిస్తాన్‌(ind-vs-pak) పై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆదివారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 74 పరుగులతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్‌ శుభ్‌మాన్ గిల్‌తో కలిసి రికార్డు స్థాయిలో 105 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో  భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

Also Read :  మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం.. ట్వీట్లతో పాక్ పరువు తీసిన ఇండియన్ ఓపెనర్లు!

సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్

విజయం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్ చేశాడు. పాక్ ను ప్రత్యర్థి అనడం మానేయాలన్నారు సూర్య.  మీరు భారత్-పాకిస్తాన్ మధ్య పోటీ గురించి ప్రశ్నలు అడగడం మానేయాలి. నా అభిప్రాయం ప్రకారం, రెండు జట్లు 15-20 మ్యాచ్‌లు ఆడితే అది సమానంగా ఉంటే పోటీ అనొచ్చు. వన్ సైడ్ గా భారత్ గెలుస్తూ వస్తుంది. ఇందులో ఆ జట్టు పోటీ ఎక్కడుందని సూర్య ప్రశ్నించారు. మేం పాకిస్థాన్ కంటే మెరుగ్గా క్రికెట్ ఆడామని భావిస్తున్నాను, బౌలింగ్ పరంగా కూడా అని సూర్య తెలిపారు.   పాకిస్థాన్‌పై భారత్ ఇటీవల సాధిస్తున్న నిరంతర విజయాలను దృష్టిలో ఉంచుకొని సూర్యకుమార్ ఈ కామెంట్స్ చేశారు. కాగా ఆసియా కప్ లో భారత్ తో ఆడిన రెండు మ్యాచ్ లోనూ పాక్ ఓడిపోయింది. 

ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌తో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో భారత్ నాలుగింటిలో సాధించింది,  టీ20లలో, ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌ల్లో భారత్ 12 విజయాలు సాధించింది. ఐసిసి పురుషుల వన్డే ప్రపంచ కప్‌లో, పాకిస్తాన్‌తో ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచింది, టీ20 ప్రపంచ కప్‌లో కూడా 8 మ్యాచ్‌ల్లో భారత్ 7  మ్యాచ్ లలో గెలిచింది. 

6 వికెట్ల తేడాతో విజయం

ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే..  పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని  నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అటు పాకిస్థాన్ మంగళవారం శ్రీలంకతో తలబడనుంది. 

Also Read :  వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

#telugu-cricket-news #telugu-sports-news #latest-telugu-news #ind-vs-pak #Suryakumar Yadav #Asia cup 2025 #telugu-news
Advertisment
తాజా కథనాలు