/rtv/media/media_files/2025/05/20/zudOGUcbyCmbnpqng3v2.jpg)
Pakistan Espionage network in india Kashmir to Kanyakumari
India Espionage: పహల్గాం ఘటనపై భయంకర నిజాలు బయటపడుతున్నాయి. పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేసేందుకు ఇండియాలో కశ్మీర్ To కన్యాకుమారి గూఢచర్య నెట్‌వర్క్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయగా మరికొంతమందిని అదుపులోకి తీసుకోనున్నారు.
Also Read : విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్..తొందరలోనే
నార్త్ ఇండియానుంచే ఎక్కువ..
ఈ మేరకు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో పాకిస్తాన్ గూఢచర్య నెట్ వర్క్ గుట్టు బయటపడుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచే పాక్ కోసం చాలామంది పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్ యెన్సర్లు, సెక్యూరిటీ గార్డులు, టూరిస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ రెండు వారాల్లోనే దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు. ఈ నిందితులంతా భారత సున్నితమైన సమాచారాన్ని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించినట్లు విచారణలో బయటపడింది. ఇందులో ప్రధానంగా పంజాబ్‌లో 6, హరియాణాలో 5, ఉత్తర్‌ప్రదేశ్ ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకుని..
ఇక హరియాణాకు చెందిన మహిళా యూట్యూబర్‌కు జ్యోతి మల్హోత్రాకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలు ఉడటం సంచలన రేపుతోంది. రహీంను దేశంనుంచి బహిష్కరించారు. పంజాబ్ అజ్నాలాకు చెందిన ఫలక్షేర్ మసిహ్, సూరజ్ మసిహ్ సరిహద్దు జిల్లాలోని ఆర్మీ కంటోన్మెంట్ సమాచారం, ఫొటోలు పాక్ అధికారులకు ఇచ్చినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే పంజాబ్ మలేర్‌కోట్లాకు చెందిన గుజాలా, యమీన్ మహ్మద్ పాకిస్తాన్‌కు సైనిక రహస్యాలను అందించి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు గుర్తించి వారిని అరెస్టు చేశారు.
Also Read : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు
గూఢచారుల అరెస్టులు..
ఇక పంజాబ్‌కు చెందిన సుఖ్‌ప్రీత్‌సింగ్, కరన్‌బిర్‌సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’, సైనిక కదలికలు, కీలక ప్రాంతాల సమాచారాన్ని ISIకి అందించినట్లు నిర్ధారించి అరెస్ట్ చేశారు. హరియాణా పానిపట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నౌమన్ ఇలాహికి ISIతో సంబంధాలున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. కైథల్ జిల్లా గుహ్లాలో పీజీ విద్యార్థి దేవేందర్ సింగ్ భారత ఆయుధాల ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా ఇతన్ని అరెస్ట్ చేశారు. నుహ్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అర్మాన్ సైనిక సమాచారాన్ని పాక్ హైకమిషన్ ఉద్యోగికి పంపించడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ బార్డర్ లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న షాజాద్.. పాక్ వెళ్లి సమాచారం అందించినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతను సిమ్‌కార్డ్‌లు కొనుగోలు చేసి ISI ఏజంట్లకు అందించినట్లు గుర్తించారు.
Also Read : పొడవకుండా రక్త పరీక్ష...నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం
telugu-news | today telugu news