HYD: పొడవకుండా రక్త పరీక్ష...నీలోఫర్ లో మొదటిసారి ప్రయోగం

వైద్యపరంగా నీలోఫర్ ఆసుప్రతి మరో అడుగు ముందుకు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారి సూదితో పొడవకుండా రక్త పరీక్షను నిర్వహించింది. ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్‌ సాధనాన్ని క్విక్‌ వైటల్స్‌ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

New Update
hyd

AI based blood test mission

ఏఐ అధ్బుతాలు చేస్తుందని అందరూ ఊహించారు. అందుకు తగ్గట్టుగానే జరుగుతోంది కూడా. ముఖ్యంగా వైద్యపరంగా చాలా అడ్వాన్స్ డ్ పద్ధతులను ఏఐ ద్వారా సాధిస్తున్నారు. తాజాగా సూదితో పొడవకుండానే రక్త పరీక్షలు నిర్వహించే సాధనాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అది కూడా మన హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా దీనిని పరీక్షించారు. దేశంలోనే ఇది తొలిసారి అవడం మరో విశేషం. ఫొటో ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ అనే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ సాధనాన్ని ప్రవేశపెట్టారు. క్విక్ వైటల్ సంస్థ దీన్ని రూపొందించింది. దీనిలో మరో సౌలభ్యం ఏంటంటే..ఇంతకు ముందులా పరీక్ష చేయించుకున్నాక వెయిట్ చేయాల్సి అవసరం ఉండదు. ఈ పీపీజీ పరికరం మన ముఖాన్ని స్కాన్‌ చేసి ఒక్క నిమిషంలోపు ఫలితాలు అందిస్తుంది. ఈ సాధనాన్ని సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ ఇన్‌ఛార్జి, మెంబర్‌ ఆఫ్‌ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ప్రొ.డాక్టర్‌ సంతోష్‌కుమార్‌ క్రాలేటి, ఫౌండేషన్‌ ఫర్‌ ఫ్యూచరిస్టిక్‌ సిటీస్‌ అధ్యక్షురాలు, భాజపా జాతీయ నాయకురాలు కరుణా గోపాల్, క్విక్‌ వైటల్స్‌ వ్యవస్థాపకుడు హరీశ్‌ బిసం, నిలోఫర్‌ ఆసుపత్రి వైద్యాధికారులు డాక్టర్‌ లాలూప్రసాద్‌ రాథోడ్, డాక్టర్‌ విజయకుమార్, డాక్టర్‌ మాధవీలతో కలిసి నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌ ప్రారంభించారు. 

Also Read :  రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!

Also Read :  12 రోజుల తర్వాత వాఘా-అట్టారీ బోర్డర్ లో బీటింగ్ రిట్రీట్

30 సెకన్లలోనే..

ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ ఒక ఎల్ఈడీ స్క్రీన్ లా ఉంటుంది. దీన్ని ట్రైపాడ్ కు అమర్చిన పీపీజీ మిషన్ తో అనుసంధానితమైన సెల్ ఫోన్ స్క్రీన్ వైపు 30 నుంచి 40 సెకన్లు చూడాలి. దీనిలో బీపీ, ఆక్సిజన్, హార్ట బీట, రెస్పిరేషన్, హెచ్ఆర్వీ, ఒత్తిడి స్థాయిలు, హిమోగ్లోబినక, పల్స్ రెస్పిరేటరీ కోషెంట్, సింపథిటిక్, పారా సింపథిటిక్ వంటి పరీక్షలు చేసుకోవచ్చును. నీలోఫర్ ఆసుపత్రిలో ఈ అధునాతన మిషన్ ను రెండు నెలల పాటూ పరీక్షించనున్నారు. వెయ్యి మంది పిల్లను టెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే రాష్ట్రంలో మిగతా ఆసుపత్రుల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 

 today-latest-news-in-telugu | hyderabad | nilofar-hospital | blood-test 

 

Also Read: corona: మరోసారి విజృంభిస్తున్న మహమ్మారి.. దేశవ్యాప్తంగా 257 కరోనా కేసులు

Also Read :  తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు