/rtv/media/media_files/2025/10/30/smriti-mandhana-wedding-date-2025-10-30-17-13-21.jpg)
smriti mandhana Wedding Date
లేడీ కోహ్లీగా అభిమానుల మనసు దోచుకున్న క్రికెటర్ స్మృతి మంధానా(smriti-mandhana) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. భారత మహిళా క్రికెట్ జట్టులో స్టార్ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్మృతి.. ఇప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు సింగర్, డైరెక్టర్, యాక్టర్.. అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రియుడు పలాష్ ముచ్చలను ఆమె వివాహం చేసుకోబోతుంది.
Also Read : కోల్‌కతా నైట్ రైడర్స్ కీలక నిర్ణయం!
Smriti Mandhana Wedding Date
వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. దాదాపు 2019 నుంచి సీక్రెట్‌గా లవ్ చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా సార్లు బయట కెమెరాలకు చిక్కడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటపడింది. అయితే తమ ప్రేమ వ్యవహారం గురించి తరచూ ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ.. ఇటీవలే పలాష్ ముచ్చల్ పరోక్షంగా స్మృతితో తన వివాహాన్ని వెల్లడించారు(Smriti Mandhana Wedding Date Fix). ‘‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’’ అని మీడియాకు తెలియజేశారు.
Speculation about Indian cricketer Smriti Mandhana and music director Palash Muchhal intensified after Muchhal publicly confirmed that Mandhana will soon become Indore's daughter-in-law. pic.twitter.com/t0UdgbkL0S
— Karthik Nandihalli (@KarthikNan45) October 19, 2025
Also Read : ప్రాక్టీస్ లో బాల్ తగిలి టీనేజ్ క్రికెటర్ మృతి
దీంతో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని ఇప్పుడు పెళ్లి బంధంగా మార్చుకోబోతున్నారని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తాజాగా స్మృతి- పలాష్ ముచ్చల్ పెళ్లి తేదీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరి వివాహం వచ్చే నెల అంటే నవంబర్ 20వ తేదీని అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. పెళ్లి తేదీతో పాటు ఎక్కడ జరగనుందో కూడా తెలిసింది.
స్మృతి- పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 20న స్మృతి స్వస్థలమైన మహారాష్ట్రలోని సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్.. ఇరు కుటుంబాల నుంచి ఇంకా రానప్పటికీ.. పెళ్లి తేదీ మాత్రం ఇప్పుడు జోరుగా వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే స్మృతి లవ్ చేసిన పలాష్ ముచ్చల్ మే 22, 1995న ఒక మార్వారీ కుటుంబంలో జన్మించాడు. బాలీవుడ్‌లో బాగా పేరుగాంచిన సింగర్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్, యాక్టర్ కూడా. అతడు గాయని పాలక్ ముచ్చల్ సోదరుడు. తన సోదరిలాగే అతను అనేక పాటలను పాడాడు. అతను రాజ్‌పాల్ యాదవ్-రుబీనా దిలైక్ నటించిన ‘అర్ధ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాకుండా పలాష్ ముచ్చల్ బాలీవుడ్‌లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. 18 సంవత్సరాల వయసులో ఆయన తన మొదటి పాటను కంపోజ్ చేశారు.
 Follow Us
 Follow Us