Smriti Mandhana : స్మృతి మంధాన ప్రపంచ రికార్డు..ఒకే ఒక్క క్రికెటర్

ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకుంది.

New Update
mandana

ప్రపంచ నంబర్ 1 వన్డే బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో మహిళల వన్డేల్లో 1000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా తన పేరును నమోదు చేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా(australia)తో జరుగుతున్న మ్యాచ్ లో స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ బెలిండా క్లార్క్ రికార్డును మంధాన బద్దలు కొట్టింది. 

Also Read :  AUS vs IND : ఆసీస్ తో మ్యాచ్.. టీమిండియా బౌలింగ్

మరో రికార్డు కూడా తన ఖాతాలో

1997లో సదరన్ స్టార్స్ తరఫున క్లార్క్ 16 వన్డేలు ఆడి మొత్తం 970 పరుగులు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మంధాన(smriti-mandhana) 80 పరుగులు చేసింది. దీంతో మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంది. ఆమె మహిళల వన్డేల్లో 5000 పరుగులు పూర్తి చేసింది. మంధాన 112 వన్డేల్లో ఈ ఘనతను అందుకుంది. బంతుల పరంగా కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగులు చేసింది మంధాన. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ సుజీ బేట్స్ 2022లో 5000 పరుగుల క్లబ్‌లో చేరడానికి 6182 బంతులు అవసరం కాగా, మంధాన 5569 బంతులు ఆడింది.

ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్  5000 పరుగులు చేసిన ప్రపంచంలో ఐదవ క్రికెటర్ కావడం విశేషం.  ఇప్పటివరకు, మహిళల వన్డేల్లో నలుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే 5000 కంటే ఎక్కువ పరుగులు చేయగలిగారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉన్నారు. 1999 నుండి 2022 వరకు తన 23 ఏళ్ల కెరీర్‌లో మిథాలీ 232 వన్డేలు ఆడి మొత్తం 7805 పరుగులు చేసింది. ఆమె తర్వాత ఇంగ్లాండ్‌కు చెందిన షార్లెట్ ఎడ్వర్డ్స్, న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్, వెస్టిండీస్‌కు చెందిన స్టెఫానీ టేలర్ ఉన్నారు.  

Also Read :  టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను చూశారా?

మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో  భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది.  ప్రతీక రావల్ (75), స్మృతి మంధాన(80), హర్లీన్ డియోల్(38) పరుగులు చేశారు. 

Advertisment
తాజా కథనాలు