Shubman Gill : 7 టెస్టుల్లో 6 సెంచరీలు… శుభ్‌మాన్ గిల్‌  సెంచరీల సునామీ

భారత క్రికెట్ జట్టు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభ్‌మాన్ గిల్ మరింత ప్రమాదకరంగా మారాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించినట్లే స్వదేశంలో కూడా వెస్టిండీస్ బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు.

New Update
gill

భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team) టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభ్‌మాన్ గిల్(Shubman Gill) మరింత ప్రమాదకరంగా మారాడు. ఇంగ్లాండ్‌లో ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించినట్లే స్వదేశంలో కూడా వెస్టిండీస్(west-indies) బౌలర్లను కూడా ఉతికారేస్తున్నాడు. ఢిల్లీ టెస్ట్ రెండో రోజున గిల్ అద్భుతమైన సెంచరీ సాధించి, టీమ్ ఇండియాను భారీ స్కోరుకు తీసుకెళ్లాడు. కెప్టెన్ అయినప్పటి నుండి అతను ఆడిన  ఏడు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీలు చేశాడు, వాటిలో నాలుగు సెంచరీలు,  ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి.

Also Read :  జోరుగా రోహిత్ ప్రాక్టీస్... దెబ్బకు లంబోర్గిని కారు అద్దాలు బద్దలు

20 పరుగుల వద్ద

ఢిల్లీ టెస్ట్‌లో రెండో రోజు 20 పరుగుల వద్ద శుభ్‌మాన్ గిల్ తన ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించాడు.  95 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత అతను బౌలర్లను కఠినంగా ఎదుర్కొంటూ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. దూకుడు షాట్‌లతో అలరించాడు. 177 బంతుల్లో 13 ఫోర్లు,  ఒక సిక్స్‌తో తన 10వ టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. ఇక యంగ్ ఓపెనర్ యశస్వి 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు, ఆపై నితీష్ కుమార్ రెడ్డితో కలిసి, శుభ్‌మాన్ జట్టు స్కోరును 400 దాటించాడు.

Also Read :  రూ. కోట్లు ఇస్తావా.. చస్తవా.. రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు

భారత జట్టు టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత శుభ్‌మాన్ గిల్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జరిగిన మ్యాచ్ లో  147 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత, బర్మింగ్‌హామ్‌లో 269 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అదే మ్యాచ్‌లోని రెండవ ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. శుభ్‌మాన్ గిల్ మాంచెస్టర్ టెస్ట్‌లో 103 పరుగులు చేశాడు.  ఇప్పుడు ఢిల్లీ టెస్ట్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేశాడు. 

Advertisment
తాజా కథనాలు