Rohith Sharma: జోరుగా రోహిత్ ప్రాక్టీస్...దెబ్బకు లంబోర్గిని కారు అద్దాలు బద్దలు

ఆస్ట్రేలియా టూర్ మీద రోహిత్ శర్మ మంచి పట్టుదలగా ఉన్నాడు. లా అయినా తనను తాను నిరూపించుకోవాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా లంబోర్గిని కారు అద్దాలనే బద్దలు కొట్టాడు. 

New Update
rohith

రోహిత్ శర్మకు ఉన్న మరో పేరు హిట్ మ్యాన్. కొడితే బంతి సిక్స్ అవ్వాల్సిందే. బలమైన సిక్స్ లు కొట్టడంలో రోహిత్ ది అందె వేసిన చెయ్యి. కొన్ని సార్లు ఈ షాట్లతో బంతి గ్రౌండ్ అవతికి కూడా వెళ్ళిపడుతుంది. రోహిత్ శర్మ ఆడితే చితక్కొట్టుడే ఉంటుంది. మామూలుగా ఆడేది చాలా తక్కువే.

కొంత కాలంగా రోహిత్ శర్మకు టఫ్ టైమ్ నడుస్తోంది. టీ20, టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాక...అతను ఇక మొత్తం అసలు ఆడడనే అనుకున్నారు అందరూ. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయినా కూడా రోహిత్, విరాట్ లను ఇక జట్టులోకి తీసుకోరంటూ రూమర్లు క్రియేట్ చేశారు. అయితే బీసీసీఐ వీటన్నిటికీ చెక్ పెడుతూ ఆస్ట్రేలియా టూర్ కు సీనియర్ స్టార్లు ఇద్దరినీ సెలెక్ట్ చేసింది. అయితే రోహిత్ దీనికి ముందు తన ఫిట్ నెస్ ను నిరూపించుకున్నాడు. దానికి తోడు అతనిని సెలెక్టర్లు కెప్టెన్ స్థానం నుంచి తప్పించారు. ఇది అతనిని కాస్త నిరాశ పరిచే విషమయే. దీనిని రోహిత్ బయట పెట్టలేదు. కానీ ఆస్ట్రేలియా టూర్ లో మాత్రం తనను తాను నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. 

ముంబయ్ లో ప్రాక్టీస్..

అందుకే రోహిత్ శర్మ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబయ్ లో అభిషేక్ నాయర్ తో కలసి రెండు గంటలు ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో రోహిత్ కొట్టిన సిక్స్ దెబ్బకు బంతి గ్రౌండ్ దాటి పార్కింగ్ లో ఉన్న లంబోర్గిని కారు అద్దాలను బద్దలు కట్టింది. అయితే అదృష్టవశాత్తు అది తన కారే అవడంతో గొడవ అవ్వలేదు. ఇక రోహిత్ శర్మతో పాటూ రఘువంశీ సహా మరికొంత మంది ఆటగాళ్లు నెట్స్‌ సెషన్‌లో పాల్గొన్నారు. శివాజీ పార్క్‌లో రోహిత్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఈనెల 19న పెర్త్‌లో  ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆరంభమవుతుంది. రోహిత్‌ భారత్‌ తరఫున చివరగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు.

Also Read: Trump On Nobel Prize: నా గౌరవం కోసమే తీసుకున్నారు...నోబెల్ బహుమతిపై మాట్లాడిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు