Rinku Singh : రూ. కోట్లు ఇస్తావా.. చస్తవా.. రింకు సింగ్ కు దావూద్ గ్యాంగ్ బెదిరింపులు

రింకు సింగ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుండి బెదిరింపులు వచ్చాయి.  ఈ విషయాన్ని  ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డి-కంపెనీ' గ్యాంగ్ నుండి రింకు సింగ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది.

New Update
dawood

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ రింకు సింగ్‌(rinku-singh) కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(dawood-ibrahim) గ్యాంగ్ నుండి బెదిరింపులు(Ransom Threat) వచ్చాయి.  ఈ విషయాన్ని  ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన 'డి-కంపెనీ' గ్యాంగ్ నుండి రింకు సింగ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. ఇందులో ఆ గ్యాంగ్ రింకు సింగ్‌ను రూ. 5 కోట్ల వరకు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడింది.  ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మూడు సార్లు బెదిరింపలకు పాల్పడ్డారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తుండగా 2025 ఆగస్ట్ 1న భారత అధికారులకు అప్పగించబడ్డారు.

Also Read :  తగ్గేదేలే... చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌

రూ.10 కోట్లు డిమాండ్

విచారణలో తాము రింకు సింగ్ ను బెదిరించినట్లుగా ఒప్పుకున్నారు. గతంలో వీరు జీషాన్ సిద్దిఖీ దివంగత ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ కొడుకు నుంచి కూడా రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.  అండర్ వరల్డ్ నుండి భారత క్రికెట్ స్టార్‌కు బెదిరింపులు రావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో సాధారణ జీవితం నుండి ఎదిగిన రింకు, క్రికెట్‌లో రాణించడానికి చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇటీవల ఎంపీ ప్రియా సరోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు రింకు సింగ్.  

భారత్ తరపున మొత్తం 54 టీ20 మ్యాచ్(IPL 2025) లు ఆడిన రింకు సింగ్ 550 పరుగులు చేశాడు.  అతని ఐపిఎల్ సంఖ్యల విషయానికొస్తే, సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 58మ్యాచ్ లు ఆడి 1099 పరుగులు చేశాడు. 2024లో కెకెఆర్ టైటిల్ గెలుచుకోగా అందులో రింకు కూడా ఒక సభ్యుడు. రింకూ సింగ్ ప్రస్తుతం కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 

Also Read :  జడేజా ముందు చరిత్ర సృష్టించే రికార్డు.. కేవలం 10 పరుగులు చాలు

Advertisment
తాజా కథనాలు