/rtv/media/media_files/2025/04/27/EISXVlQk0CQw9H3cZINt.jpg)
Shubman Gill - Sara Tendulkar
టీమిండియా స్టార్ బ్యాటర్ శుభమన్‌గిల్ - క్రికెట్ గాడ్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి చెట్టా పట్టాలేసుకుంటూ బయట తిరుగుతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అక్కడితో ఆగకుండా.. త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సాగాయి.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
డీప్ ఫేక్ ఫొటోస్
అందుకు సంబంధించి గిల్-సారా కలిసి ఉన్నట్లు డీప్ ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అలాగే ఇతర దేశాలతో టీమిండియా మ్యాచ్‌లు ఆడుతుందంటే.. అక్కడ సారా టెండూల్కర్ కనిపించేది. దీంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. అయితే ఒక్క సారా టెండూల్కర్‌తోనే కాకుండా.. సారా అలీ ఖాన్, రిద్ధిమా పండిట్, అవనీత్ కౌర్ వంటి పలువురితో శుభ్ మన్ గిల్ డేటింగ్‌లో ఉన్నాడని వార్తలు జోరుగా సాగాయి.
Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
Shubman Gill finally broke his silence on the Sara Tendulkar dating rumours, saying he is fully focused on his cricket career. pic.twitter.com/A1aFZYG9fz
— Vipin Tiwari (@Vipintiwari952) April 27, 2025
3 ఏళ్లుగా అంటూ
ఈ వార్తలన్నీంటికి శుభ్‌మన్ గిల్ పుల్‌స్టాప్ పెట్టాడు. మొదటి సారిగా తనపై వస్తున్న డేటింగ్ వార్తలకు స్పందించాడు. ఈ మేరకు హాలీవుడ్ రిపోర్డర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుభ్ మన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను దాదాపు 3 ఏళ్ళుగా సింగిల్ గానే ఉన్నానని క్లారిటీ ఇచ్చేశాడు.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
తనపై వస్తున్న డేటింగ్ వార్తలు అవాస్తవమని తెలిపాడు. ఎవరెవరితోనో తనకు ముడిపెడుతున్నారని.. తనకు పరిచయం లేని వ్యక్తులతో లింక్ చేసి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని పేర్కొన్నాడు. ఇదంతా నిజం కాదని.. తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని తనపై వస్తున్న అన్ని రూమర్స్‌కు చెక్ పెట్టేశాడు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
తాను చాలా ప్రొఫెషనల్ అని.. తనకు క్రికెటే ప్రపంచం అని అన్నాడు. ఆ కారణంగానే తాను రిలేషన్‌లో ఉండేంత టైం తనకు దొరకదని చెప్పుకొచ్చాడు. రూమర్స్ అనేవి ఆటోమాటిక్ స్విచ్ లాంటివని.. అవి ఎప్పుడు ఎవరిమీదకు వెళ్తాయో అస్సలు ఊహించలేమని తెలిపాడు.
subhman-gill | sara-tendulkar | sachin-telndulkar | latest-telugu-news | telugu-news