/rtv/media/media_files/2025/10/03/shoaib-malik-sana-javed-divorce-2025-10-03-21-08-33.jpg)
shoaib malik sana javed divorce
భారత టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా(sania-mirza) మాజీ భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(shoaib-malik) ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. సానియా మీర్జాను 2010లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి కొడుకు (ఇజాన్) జన్మిచాడు. కొన్నాళ్లపాటు హ్యాపీ జీవితాన్ని సాగించిన ఈ జంట 14 ఏళ్ల దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టారు. 2024లో విడాకులు తీసుకున్నారు. అనంతరం మాలిక్..పాక్ హీరోయిన్ సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు.
Also Read : ‘నీ నగ్న ఫొటోలు పంపు’.. బాలీవుడ్ హీరో కూతురికి మెసేజ్‌లు
Shoaib Malik Sana Javed Divorce
అప్పటి నుంచి షోయబ్- సనా(sana-javed) కలిసి చెట్టాపట్టాలేసుకుంటూ ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు వీరు కూడా తమ హ్యాపీ లైఫ్‌కు చెక్ పెట్టేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో మనస్పార్థాల కారణంగా విడాకులు(divorce) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నేషనల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి.
#BREAKING : Sania Mirza's Ex-Husband Shoaib Malik Files for Divorce from Third Wife Sana Javed
— upuknews (@upuknews1) October 3, 2025
Shoaib Malik, ex-husband of tennis star Sania Mirza, is reportedly heading for a split with his third wife, actress Sana Javed.
Malik, who is a former captain of Pakistan’s men’s… pic.twitter.com/OKqXCTLvLi
Also Read : దుర్గా పూజలో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్ తాకిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
ఈ జంట తమ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు సమాచారం. అది మాత్రమే కాకుండా ఇటవల ఈ జంట ఒక కార్యక్రమానికి వెళ్లింది. అక్కడ ఒక సందర్భంలో షోయబ్ తన ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా.. సనా తన ముఖాన్ని కోపంగా పక్కకు తిప్పుకుంది. అంతేకాకుండా ఒకే సోఫాలో కూర్చున్న వీరిద్దరూ దూరం దూరంగా ఒకరికొకరు మాట్లాడుకోకుండా సీరియస్‌గా కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో సైతం వీరి విడాకుల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.
దీంతో త్వరలోనే వీరి విడాకుల ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా షోయబ్ మాలిక్‌కు మాత్రమే కాదు.. నటి సనా జావేద్‌కు కూడా ఇది సెకండ్ మ్యారేజ్. ఆమె 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది సనా. ఇక పెళ్లై ఎంతో కాలం కాకముందే మళ్లీ విడాకుల వార్తలు రావడం చూస్తుంటే షోయబ్, సనా బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు షోయబ్ మాలిక్ కానీ, సనా జావేద్ కానీ వారి విడాకుల వార్తలపై అధికారికంగా స్పందించలేదు.