Rohit Sharma: కెవ్ కేక.. T20ల్లో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డు

రోహిత్ శర్మ టీ20ల్లో అదిరిపోయే రికార్డు సాధించాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌తో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 8వ ఆటగాడిగా నిలిచాడు.

New Update
rohith sharma mass batting

rohith sharma

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా మ్యాచ్‌లు ఆడుతున్నాయి. 18వ ఎడిషన్ టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs  ముంబై ఇండియన్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. 

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. ఈ లక్ష్య ఛేదనకు దిగిన MI జట్టు 3 వికెట్లు నష్టపోయి విజయాన్ని తన  ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. భారీ షాట్లతో క్రికెట్ అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాడు. ఫామ్‌‌లో లేడని మొరిగిన వారికి గట్టి సమాధానం ఇచ్చాడు. 

Also Read : ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Rohith Sharma Record

అదే సమయంలో రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 46 బంతుల్లో 70 పరుగులు చేసిన రోహిత్.. టీ20 క్రికెట్‌లో భారీ స్కోర్ సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. టీ20ల్లో హిట్ మ్యాన్ దాదాపు 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన రెండవ భారత ప్లేయర్‌గా రోహిత్ తన పేరిట రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. అలాగే ఓవరాల్‌గా టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లో చేరిన 8వ ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం అతడు 12,058 పరుగులను కలిగి ఉన్నాడు. 

rohit-sharma | latest-telugu-news | telugu-news | IPL 2025 | srh-vs-mi

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు