/rtv/media/media_files/2025/04/24/HwJVktp0ftrB8kGVwNrh.jpg)
bcci pakistan
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఐసీసీ కారణంగానే పాక్‌తో తటస్థ వేదికల్లో ఆడుతున్నట్లు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నా అని ఆయన తెలిపారు. కాగా 2008లో ముంబై దాడి కారణంగా భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో పర్యటించింది. అప్పుడు టీం ఇండియా ఆసియా కప్‌లో పాల్గొంది. కాగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిచింది. కాగా . కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 28మంది టూరిస్టులు చనిపోయారు.