New Update
/rtv/media/media_files/2025/01/11/hmtDYbdxpSevuL8AKjk5.jpg)
Novak Djokovic
N Djokovic: టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ తన కెరీర్‌లో ఎదురైన ఒక భయంకర విషయాన్ని బయటపెట్టారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో తనపై మెల్‌బోర్న్ వేదికగా విష ప్రయోగం జరిగిందంటూ సంచలనం రేపారు. ఈ మేరకు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జకోవిచ్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన 2020-22 సమయంలో టీకా వేసుకోలేదని చెప్పాడు. దీంతో కొవిడ్ రూల్స్ ప్రకారం ఆస్ట్రేలియా అధికారులు తనను గృహం నిర్బంధంలో ఉంచారని, టీకా తీసుకుంటేనే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనిస్తామని హెచ్చరించినట్లు తెలిపాడు. అయినప్పటికీ తాను ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల తర్వాత సొంత దేశం సెర్బియాకు పంపించినట్లు వెల్లడించాడు.
🙏🏼❤️❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/MWP4VRwvfg
— Novak Djokovic (@DjokerNole) July 10, 2022
కోవిడ్ టీకా తీసుకోలేదనే కారణంతో..
‘నాకు కరోన టైమ్ లో కొన్ని అనారోగ్య సమస్యలొచ్చాయి. అందుకే కోవిడ్ టీకా తీసుకోలేదు. అధికారులతో వాగ్వాదం తర్వాత మెల్‌బోర్న్ హోటల్‌లో నాపై విష ప్రయోగం జరిగినట్లు తెలిసింది. నా బాడీలో అధిక స్థాయిలో షుగర్, లెడ్ ఎక్కువగా ఉన్నట్లు నా పర్సనల్ డాక్టర్స్ చెప్పారు. ఫుడ్ లోనే పాయిజన్ కలిపినట్లు అనుమానం వచ్చింది. అయితే ఇప్పుడు దాని గురించి చర్చపెట్టొ్ద్దు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం టెన్నిస్ మీదనే ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక జకోవిచ్ ఆరోపణలపై స్పందించిన డాక్టర్ డామియన్ మాగంజా.. ‘జకోవిచ్ తిన్న ఫుడ్ లో ఓవర్ మెర్య్కూరీ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఫిష్ లేదా నత్తల్లో మాత్రమే ఇవి ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రేలియాలో అవి దొరకటం చాలా అరుదు. మెర్క్యూరీ విషంగా మారాలంటే చాలా టైమ్ పడుతుంది. పరీక్షలు సరిగ్గా చేయకుండా ఆహారంలో విషం కలిసిందనండం మంచిది కాదు' అని అన్నారు.
తాజా కథనాలు