Ashwin: భారత ఆటగాడు రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై మాజీ క్రికెటర్ ఆశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో స్థాయికి తగ్గ ఆడకపోయినా అతని ప్రతిభ అద్భుతమని పొగిడేశాడు. ప్రపంచంలోనే పంత్ అత్యుత్తమ డిఫెన్సివ్ టెక్నిక్ కలిగిన ప్లేయర్ అంటూ పొగిడేశాడు. ఈ మేరకు రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన అశ్విన్.. పంత్ ఎప్పుడు ఏం చేయాలనేది సరైన పద్ధతిలో చెబితే చాలు పని కానిచ్చేస్తాడని చెప్పాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఎక్కువ రన్స్ చేయలేకపోయాడు. కానీ కొందరిలా ఫేలవంగా పర్యటనను ముగించలేదన్నాడు. Ravi Ashwin on Rishabh Pant's Defensive Technique pic.twitter.com/VoV6ZsfiAf — RVCJ Media (@RVCJ_FB) January 10, 2025 పంత్ సామర్థ్యం ఇంకా బటయపడలేదు.. 'పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా టైమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. పంత్ సామర్థ్యం ఇంకా బటయపడలేదు. అన్ని రకాల షాట్లను ఆడగల సత్తా ఉంది. స్వీప్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, అప్పర్ కట్ అన్ని ఆడేస్తాడు. ఇవి హై రిస్క్ షాట్లే. పంత్ డిఫెన్స్ మోడ్‌లో 200 బంతులు ఎదుర్కొంటే సెంచరీ కొట్టగలడు. ఎప్పుడు ఎటాకింగ్‌కు వెళ్లాలి.. ఎప్పుడు డిఫెన్స్ ఆడాలనేది పంత్ కు బాగా తెలుసు. సిడ్నీ టెస్టులో పంత్ రెండు రకాల ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 40 పరుగులు రాబట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టేశాడు. తొలి ఇన్నింగ్స్ గురించి అందరు మరిచిపోయి పొగిడేశారు' అని అశ్విన్ అన్నాడు. ఇది కూడా చదవండి: Rythu Bharosa: వారికే రైతు భరోసా ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు! ఇక విమర్శకులు పంత్ దూకుడును అర్థం చేసుకోవాలని సూచించాడు. పంత్ డిఫెన్స్‌ను తక్కువగా అంచనా వేయకూడదని, ప్రస్తుత క్రికెటర్లలో అతని డిఫెన్స్ అద్భుతమన్నాడు. ఏ బౌలర్ వేస్తున్నా ప్రశాంతంగా ఆడటం అతని స్పెషాలిటీ అని, పంత్ ఎదుర్కొన్న 10 బాల్స్ లో డిఫెన్స్ ఆడుతూ ఒక్కసారి ఔటైన సందర్భం చూపిస్తే తన పేరు మార్చుకుంటానంటూ సవాల్ విసిరాడు. ఇది కూడా చదవండి: TTD: క్షమించండి.. దిగొచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు!