ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌ రోహిత్‌ ఆడాలి : పాంటింగ్‌

తాను వన్డేల నుంచి రిటైర్‌ కావడం లేదని రోహిత్‌ శర్మ చేసిన వ్యాఖ్యలపై రికీ పాంటింగ్‌ స్పందించాడు. రోహిత్‌  2027 వన్డే ప్రపంచకప్‌ వరకు క్రికెట్ ఆడాలని అన్నాడు. వచ్చే ప్రపంచకప్‌ ఆడాలన్న లక్ష్యం రోహిత్‌లో ఉందని ది ఐసీసీ రివ్యూలో తెలిపాడు.

New Update
ponting

తాను వన్డేల నుంచి రిటైర్‌ కావడం లేదని టీమిండియా (Team India) కెప్టెన్  రోహిత్‌ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌ స్పందించాడు.  రోహిత్‌  శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు క్రికెట్ ఆడాలని పాంటింగ్‌ అన్నాడు.  వచ్చే ప్రపంచకప్‌ ఆడాలన్న లక్ష్యం రోహిత్‌లో ఉందని ది ఐసీసీ రివ్యూలో అన్నాడు పాంటింగ్‌.  దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మ ఇంకా బలంగానే కొనసాగుతుడాని పాటింగ్ అభిప్రాయపడ్డాడు.  2021లో 34 సంవత్సరాల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. వన్డే ప్రపంచ కప్ తప్ప అన్ని ఐసీసీ టైటిళ్లను గెలుచుకున్నాడు. కాగా 2023లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండయా ఓటమిపాలైంది.  

Also read :  రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

Also Read :  చిత్తూరు లో దొంగల బీభత్సం...ఇంట్లో దూరి కాల్పులు!

ఇప్పుడేమీ చెప్పలేను

2025  ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించాడు.  అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ప్రకటిస్తాడని అందరూ భావించారు కానీ ఫైనల్ తర్వాత జరిగిన మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్  ఆ ఊహగానాలను కొట్టిపారేశాడు.   2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతానో లేదా అనేది ఇప్పుడేమీ చెప్పలేనని వెల్లడించాడు. ఆటను ఆస్వాదించే వరకు జట్టులో కొనసాగుతానని... ప్రస్తుతం జట్టు ఆడే తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని లేదన్నాడు.  తాను బాగా ఆడుతున్నానని..  జట్టు కూడా బాగా ఆడుతుందని రోహిత్ శర్మ వెల్లడించాడు. 

Also read :  కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు

Also Read :  War 2: వార్2 రిలీజ్ వాయిదా?.. షూటింగ్ లో స్టార్ హీరోకి గాయాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు