ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. రికార్డు సృష్టించిన రియాన్ పరాగ్

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 13వ ఓవర్‌లో మొదటి బాల్ వదిలి అన్ని సిక్స్‌లు బాదగా.. ఆ తర్వాత ఓవర్‌ మొదటి బాల్ కూడా సిక్స్ కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు.

New Update
Riyan Parag

Riyan Parag

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగ్గా.. కేకేఆర్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్‌లో కాకుండా.. వరుసగా ఆరు బంతుల్లో సిక్స్‌లు కొట్టాడు. 13వ ఓవర్‌ మొయిన్ అలీ వేశాడు.

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్‌లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్

ఇది కూడా చూడండి: Indo-Pak tension: పాకిస్థాన్‌పై దాడి లాంఛనమే.. IAF చీఫ్‌తో ప్రధాని మోదీ

మొదటి బాల్ మినహా..

ఈ ఓవర్‌లో రియాన్ పరాగ్ మొదటి బాల్ మినహా అన్ని బాల్స్‌కి సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత 14 ఓవర్‌లో కూడా మొదటి బాల్‌కి సిక్స్ బాదాడు. ఇలా వరుసగా సిక్స్‌లు కొట్టి రియాన్ పరాగ్ ఐదో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల ప్లేస్‌లో రియాన్ పరాగ్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు చేశాడు. మొదటి స్థానంలో క్రిస్ గేల్ ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో రాహుల్ తేవతీయా, రవీంద్ర జడేజా, రింకు సింగ్ ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్ అడ్డంగా దొరికేశాడు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియో వైరల్!

ఇది కూడా చూడండి: Trump effect on Tollywood: తెలుగు సినిమాకు ట్రంప్ దెబ్బ.. 7 వేలు దాటనున్న టికెట్ ధరలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు