/rtv/media/media_files/2025/01/03/iR52XAGCGt0jHiKVbLdm.jpg)
Rishab Panth
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో టీమ్ ఇండియా (Team India) బ్యాటింగ్ చేస్తోంది. ఎప్పటిలానే ఆస్ట్రేలియా బౌలర్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. మొదటి నలుగురు ఇండియన్ బ్యాటర్లు చాలా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. క్రీజ్‌లో రిషబ్ పంత్ ఉన్నాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఇంతలోనే అతనికి అనుకోని పరిణామం ఎదురైంది. 140 Kmph వేగంతో వచ్చిన బంతి అతని చేతికి పెద్ద గాయం చేసింది. దాంతో పాటూ తలను కూడా తాకింది. ఈ బంతిని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ వేశాడు. మిచెల్ బంతి వేగానికి పంత్ చెయ్యికి గట్టి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన చోట నల్లగా కమిలిపోయింది. దీని వలన పంత్ కాసేపు బ్యాటింగ్ చేయలేకపోయాడు. వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. భారత జట్టు ఫిజియో వచ్చి పంత్ కు కాసేపు ఐస్ ప్యాక్ ఇవ్వడంతో పాటూ గాయానికి చికిత్స చేశారు. అయితే అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఓవర్లో మరో బంతిని అంతే వేగంతో విసిరాడు స్టార్క్. ఈసారి అది పంత్ తలను తాకింది. బంతి గ్రిల్‌పై ఫ్లష్‌ను తాకింది.
Also Read: USA: న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ కుట్ర లేదన్న వైట్ హౌస్
Rishabh Pant took a number of heavy hits to the body.#AUSvIND pic.twitter.com/TdyJ1qhm9C
— cricket.com.au (@cricketcomau) January 3, 2025
కష్టాల్లో టీమ్ ఇండియా..
బోర్డర్ - గవాస్కర్ (Border Gavaskar) ట్రోఫీలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతోంది.ప్రస్తుతం సిడ్నీలో చివరి టెస్టు అవుతోంది. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. చివరి టెస్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లంచ్ తర్వాత రెండో సెషన్ ఆడుతున్న భారత్ వరుసగా వికెట్లను కోల్పోతోంది. ఇప్పటివరకు 57 ఓవర్లు ఆడిన టీమ్ ఇండియా 120 పరుగులకు ఆరు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. బ్యాటర్లలో పంత్ ఒక్కడే 40 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీతో సహా మిగతా వారందరూ తక్కువ స్కోరుకే ఆవుట్ అయ్యారు. కోహ్లీ మరోసారి ఆఫ్ సైడ్ వెళుతున్న బంతిని వేటాడి ఔట్ అయ్యాడు. మరోవైపు ఈ టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ ఆడటం లేదు. కనీసం 16 గురుజట్టులో కూడా లేడే. దీంతో అతను ఇక టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మెల్‌బోర్న్ టెస్ట్ రోహిత్ కు చివరి టెస్ట్ అని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠత