సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నమోదైన కేసులో హీరో అల్లు అర్జున్ బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. అతని బెయిల్ పిటిషన్ పై ఈరోజు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనున్నది. దీనిపై ఇప్పటికే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది. మరోవైపు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులుకోరుతున్నారు. దీనిపై ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఎలాంటి తీర్పు వస్తుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. Also Read: TS: వీడియోల ఘటనలో 12 మంది అరెస్ట్! మల్లారెడ్డి కాలేజ్ సీజ్? పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె మరణించగా...శ్రీతేజ్ కిమ్స్ ఆసపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దొని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అతను డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని...బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అలా అయితే మొత్తం కేసు తారు మారు అవుతుందని...అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ పీఎస్‌లో కూడా సహకరించలేదని...అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురౌతుందని..కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉండదని పోలీసులు వాదిస్తున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువలనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు చెబుతున్నారు. Also Read: USA: న్యూ ఆర్లీన్స్ ఘటనలో విదేశీ కుట్ర లేదన్న వైట్ హౌస్