IND vs ENG: ‘హ్యాపీ రిటైర్మెంట్ జడేజా’.. కేక్ తినిపించిన రిషబ్ పంత్ (వీడియో)

టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుచుకుని నిన్నటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఇందులో జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

New Update
rishabh pant comedy comment goes viral for ravindra jadeja retirement

rishabh pant comedy comment goes viral for ravindra jadeja retirement

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా జూన్20 నుంచి జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. దీని కోసం టీం ఇండియా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఒక వేడుక జరుపుకుంది. 

Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!

‘హ్యాపీ రిటైర్మెంట్ జడేజా’

గత ఏడాది రోహిత్ శర్మ నాయకత్వంలోని టీం ఇండియా జూన్ 29, 2024న T20 ప్రపంచ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో నిన్నటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో భాగంగా వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. రవీంద్ర జడేజాతో సరదాగా గడుపుతూ కనిపించాడు. 

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

అంతేకాకుండా పంత్ ఒక్కసారిగా జడేజా రిటైర్మెంట్ గురించి మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.  రవీంద్ర జడేజాకు కేక్ తినిపిస్తూ హ్యాపీ రిటైర్మెంట్ అని రిషబ్ పంత్ నవ్వుతూ చెప్పాడు. దీంతో జడేజా వెంటనే నవ్వుతూ.. తాను ఒకే ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. 

Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!

ఇది విన్న తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరూ గట్టిగా నవ్వారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ జూలై 2 నుండి ప్రారంభమవుతుంది. 

Also Read: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

 

2024-t20-world-cup | team-india | rishabh-pant | Ravindra Jadeja

Advertisment
Advertisment
తాజా కథనాలు