Ashwin: హిందీ లాంగ్వేజ్‌పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ లాంగ్వేజ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో హిందీ జాతీయ భాష కాదని, కేవలం అధికార భాష అన్నాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

New Update
Ravi Chandran Ashwin

Ravichandran Ashwin

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరై.. తన మాటల కారణంగా అశ్విన్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. హిందీ లాంగ్వేజ్‌పై కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

ఇంతకీ ఏం జరిగిందంటే?

టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఓ ప్రైవేట్ కాలేజీ స్నాతకోత్సవానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు. ఏ భాషలో మీరు నా ప్రసంగాన్ని వినాలని అనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. ఫస్ట్ ఇంగ్లీషులో వింటారా అని అడిగితే స్పందన సరిగ్గా రాలేదు. ఆ తర్వాత తమిళంలో అని అడిగితే అందరూ అవును అని సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

చివరికి హిందీలో మాట్లాడాలా అని అడిగితే విద్యార్థుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు అశ్విన్ హిందీ మన జాతీయ భాష కాదని, కేవలం అధికారిక భాష మాత్రమేనని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అశ్విన్ మాటలను తప్పు పడుతుంటే.. మరికొందరు అతనికి సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. 

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు