తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుప్పావై పాశురాలతో 12:05 గంటల సమయంలో బంగారు వాకిలి తలుపులను ఆలయ అర్చకులు పూజ చేసి తెరిచారు. వైకుంఠ ద్వారం దగ్గర అర్చకులు పూజలు చేస్తూ, హారతి సమర్పించి తోమాలపటంతో ప్రదక్షణగా గర్భాలయానికి చేరుకున్నారు. ఇది కూడా చూడండి: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ మొత్తం పది రోజుల పాటు.. ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కైంకర్యాలతో పాటు నిత్య కైంకర్యాలు కూడా నిర్వహించారు. వేకువ జామున 4:30 గంటల నుంచే దర్శనాలకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి మొదలయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగనున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలతో పుష్పాలతో చూడటానికి కనులవిందుగా ఉంది. ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం.. ఇదిలా ఉండగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా టీటీడీ ఓ కీలక నిర్ణయం కూడా తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19 వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్ లైన్ టికెట్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ కోరింది. అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో 2023 నవంబరులో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ హోమం కోసం ఆన్‌లైన్ టికెట్లను విడుదల చేస్తోంది. టికెట్ ధర రూ.1000 కాగా.. ఒక టికెట్‌పై ఇద్దరికి అనుమతి ఉంటుంది. ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !