/rtv/media/media_files/2025/01/08/yy1JjHlNiQ96DN7jfOZk.jpg)
Vykunta Ekadasi 2025
హిందూ సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఏకాదశి నాడు ఎంతో భక్తితో విష్ణువుని పూజిస్తారు. స్వర్గానికి వైకుంఠ ఏకాదశి ద్వారాలు తెరుస్తుందని నమ్ముతారు. ఈ క్రమంలోనే ఉపవాసం ఆచరించి, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తితో విష్ణువుని కొలుస్తారు. అయితే ఏకాదశి తిథి ఉన్న సమయంలో దేవుడిని దర్శించుకుంటే పుణ్యమంతా లభిస్తుందని పండితులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్
ఏకాదశి తిథి సమయంలోనే..
ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిని జనవరి 10వ తేదీన జరుపుకుంటున్నారు. జనవరి 9వ తేదీన గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 10:19 గంటలకు ఏకాదశి తిథి ముగుస్తుంది. ఈ తిథి సమయంలో విష్ణువుని ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వరుడు లేదా విష్ణువు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి.
ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి
ఇలా పూజిస్తేనే మోక్షం లభిస్తుందని..
వైకుంఠ ఏకాదశి (Vykunta Ekadasi 2025) నాడు విష్ణువు లేదా వెంకటేశ్వరుని ఆలయాలను భక్తులు సందర్శిస్తారు. ఈ ఏకాదశి నాడు తెల్లవారు జామునే లేచి తలస్నానం చేయాలి. విష్ణువుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని, ఏకాదశి తిథి ఉన్నంత వరకు ఉపవాసం ఆచరించాలి. ఏకాదశి తిథి పూర్తయిన తర్వాతే ఉపవాసం విరమిస్తేనే ఫలితం ఉంటుంది. రోజంతా విష్ణు నామస్మరణం చేస్తూ పూజిస్తే మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఏకాదశి నాడు మద్యం, ధూమపానం, ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం వంటివి తీసుకోకూడదు. అలాగే ఇతరులపై ఈర్ష్య, కోపం భావంతో ఉండకూడదు.