/rtv/media/media_files/2025/02/05/oGWx1b9xHOhYnlorFpRe.jpg)
Rashid Khan breaks Bravo record
Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్ షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్
ఇక ఇప్పుడు ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్(Gujrat Titans) తరఫున ఆడుతున్నాడు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా భారత్ లోనూ ఎక్కువమందే ఉన్నారు. అయితే తాజాగా ఈ స్టార్ ప్లేయర్ కు అరుదైన ఘనత దక్కింది.
Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్
తన బౌలింగ్ తో ఎంతో మంది బ్యాటర్లకు చెమటలు పట్టిన రషీద్ ఖాన్ ప్రపంచ క్రికెట్(World Cricket) లో అరుదైన ఘనత సాధించాడు. అవును మీరు విన్నది నిజమే. అతడి బౌలింగ్ ఎంత టఫ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్పిన్నర్ గా తనదైన శైలిలో ఎంతటి తోపు బ్యాటర్ ని అయినా ఇట్టే ఔట్ చేయగలడు.
Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ (Rashid Khan)...
అలాంటి స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇప్పుడు నెంబర్ వన్ బౌలర్ గా నిలిచాడు. టీ20ల్లో(T20) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అతడు నిలిచాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా SA20 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ టీమ్ కు అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల పార్ల్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు రెండు వికెట్లు తీశాడు. దీంతో టీ20ల్లో (అంతర్జాతీయ+లీగ్ లు) కలిపి మొత్తం 633 వికెట్లు తీశాడు. అందులో అఫ్గాన్ నుంచి 161 వికెట్లు, మిగిలిన 472 వికెట్లు దేశవాళీ, అనేక లీగుల్లో తీశాడు.
బ్రావో(Bravo) రికార్డు బద్దలు...
ఇలా ఇప్పుడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. 461 మ్యాచ్ ల్లో 18.08 సగటుతో రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించాడు. అంతేకాకుండా వెస్టిండీస్ మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో రికార్డును బద్దలు కొట్టాడు. అతడు 582 మ్యాచుల్లో 24.40 సగటుతో 631 వికెట్లు తీశాడు.