Mohammed Siraj: రోహిత్ శర్మకు ఇచ్చిపడేసిన సిరాజ్.. 87 బంతుల్లో ఒక్క పరుగు ఇవ్వలేదుగా!

రంజీ ట్రోఫీలో సిరాజ్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్నాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో 87బంతుల్లో ఒక్కపరుగు కూడా ఇవ్వలేదు. 18 ఓవర్లు వేసి 7 మెయిడిన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను వద్దన్న రోహిత్‌కు అతడి బౌలింగ్ గట్టి సమాధానంలా మారింది.

New Update
ranji trophy hyderabad vs vidarbha

ranji trophy mohammed siraj bowling performance

మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం టీమిండియా జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత స్వదేశానికి వచ్చిన తర్వాత అతడిని జట్టు నుంచి తొలగించారు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ చోటు దక్కలేదు. అలాగే వన్డే సిరీస్‌లోనూ అతడిని ఎంపిక చేయలేదు. ఇది మాత్రమే కాకుండా త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా అతడిని ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేడనే కారణంగా అతడిని తొలగించారు.

Also Read :  నరకం లాంటి జైల్లో వలసదారుల్ని వేస్తాం: ట్రంప్‌!

హైదరాబాద్ తరఫున సిరాజ్

దీంతో మహ్మద్ సిరాజ్‌ ఎక్కడా కుంగిపోలేదు. మరింత రాటుదేలాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన బౌలింగ్‌తో దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నాడు. హైదరాబాద్ తరఫున ఆడుతున్న సిరాజ్ విదర్భ జట్టు బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. నాగ్‌పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్ చెలరేగాడు. 

Also Read :  అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్

87 బాల్స్‌లో జీరో రన్స్

కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసినా.. టీంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో విదర్భ జట్టు కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది. అందులో సిరాజ్ వేసిన బంతులు మాత్రం డేంజర్‌గా మారాయి. దాదాపు 87 బాల్స్‌లో ఒక్క రన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం అనే చెప్పాలి. 

Also Read :  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

సిరాజ్ దాదాపు 18 ఓవర్లు వేయగా.. అందులో 7 ఓవర్లు మెయిడెన్ చేశాడు. దీంతో సిరాజ్ ఎకానమీ రేటు ఓవర్‌కు 2.61 రన్స్‌గా మాత్రమే ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒకవైపు నుంచి ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి తెస్తున్న క్రమంలో.. అతడి సహచర బౌలర్లు మరోవైపు నుంచి వికెట్లు తీశారు. అంకితరెడ్డి, రక్షణ్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే మిలింద్‌ 2 వికెట్లు తీశాడు. 

దీంతో రోహిత్‌కు సిరాజ్ బౌలింగ్ గట్టి సమాధానం ఇచ్చిందని నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా జట్టు ప్రకటించిన తర్వాత సిరాజ్ పాత బంతితో అంత ప్రభావవంతంగా లేడని రోహిత్ చెప్పాడని.. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మకు సిరాజ్ బౌలింగ్ గట్టి సమాధానం లాంటిదని చెప్పుకొస్తున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు