RCB captain : RCB కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదార్‌!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ వచ్చాడు.  ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది.  2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతున్నాడు రజత్ పాటిదార్‌.

New Update
patidar

patidar

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు కొత్త కెప్టెన్ వచ్చాడు. ఐపీఎల్ 2025 (IPL 2025) కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించింది.  విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం నడించింది. అయితే కోహ్లీ కెప్టెన్సీపై ఆసక్తి చూపించకపోవడంతోనే  చివరికి యాజమాన్యం రజత్ పాటిదార్ పేరును ప్రకటించింది. 

Also Read :  రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

2021 నుంచి ఆర్సీబీ తరుపున

2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న రజత్ పాటిదార్‌ (Rajat Patidar) 28 మ్యాచ్‌ల్లో 158.85 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు.  ఇందులో ఓ సెంచ‌రీ, 7 హఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 112. నవంబర్‌లో జరిగిన ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకరు. జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని రూ.11 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్‌లో ఇది అతని తొలి కెప్టెన్సీ. అంతకుముందు 2024–25 సీజన్లలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలలో తన రాష్ట్ర జట్టు మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు రజత్ పాటిదార్‌.  

ఐపీఎల్ టైటిల్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు అంద‌ని ద్రాక్షగానే మిగిలిపోతుంది. మరి పాటిదార్ కెప్టెన్సీలోనైనా ఆర్సీబీ ఐపీఎల్ క‌ప్పు కొడుతుందో లేదో చూడాలి మ‌రి. 2009, 2011, 2016లో ఫైన‌ల్‌కు చేరుకుంది ఆర్సీబీ. కాగా  ఆర్సీబీ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించగా, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రాబోయే సీజన్‌కు ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించాల్సి ఉంది.  గత ఏడాది కోల్‌కతా కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

Advertisment
తాజా కథనాలు