బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్‌ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.  కాగా ఆయన ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది.

New Update
pochampally

pochampally

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్‌ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు.  కాగా మొయినాబాద్‌  మండల పరిధిలోని తొల్కట్టలోని పోచంపల్లి శ్రీనివాస్  ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది.  పదకొండు ఎకరాలున్న ఫామ్ హౌస్ లో కోడిపందేలతో పాటుగా  పేకాట, కేసినో నిర్వహిస్తున్నారనే సమాచారం రంగంలోకి దిగిన పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ మేరకు మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.30 లక్షల నగదుతో పాటుగా  55 లగ్జరీ కార్లను సైతం సీజ్ చేశారు.

11 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌హౌస్‌

11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ  ఫామ్‌హౌస్‌లో వ్యాపారి భూపతిరాజు శివకుమార్‌ వర్మ క్యాసినో, కోడిపందేలు నిర్వహించారు.  పోలీసుల అదుపులో A1గా భూపతిరాజు శివకుమార్‌ వర్మ ఉన్నారు.  అయితే త-న ఫామ్‌హౌస్‌ను లీజ్ కు ఇచ్చినట్లుగాఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్  పోలీసులకు వెల్లడించారు. కానీ ఎమ్మెల్సీ చెప్పింది అవాస్తవమని పోలీసులు తేల్చారు.  ఫామ్‌హౌస్‌లో రెండేళ్లుగా కోడిపందేలు, క్యాసినో నిర్వహణ జరుగుతోందని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు