ఐపీఎల్ ముందు రాజస్థాన్‌ రాయల్స్‌కు భారీ దెబ్బ.. ఆటకు సంజూ దూరం?

రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. దీంతో ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌ తోపాటు ఐపీఎల్‌లో కూడా ఆడకపోవచ్చని తెలుస్తోంది.

New Update
Sanju Samson

Sanju Samson Photograph: (Sanju Samson)

రాజస్థాన్ రాయల్స్‌కు ఐపీఎల్ ముందు బిగ్ షాక్ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో కెప్టెన్ సంజూ శాంసన్ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్‌ విసిరిన బాల్ సంజూ చూపుడు వేలుకి బలంగా తాకింది. దీంతో భారత్ బౌలింగ్ సమయంలో సంజూ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ద్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపింగ్‌ చేశాడు. ఈ గాయం కారణంగా సంజూ క్రికెట్‌కు కనీసం ఆరు వారాల పాటు దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు.

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

గాయం కారణంగా..

ప్రస్తుతం సంజు శాంసన్ తిరువనంతపురంలోని తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతను ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడటం కూడా కష్టమే. ఈ గాయం పూర్తిగా నయం అయిన తర్వాత మళ్లీ ఆట మొదలు పెట్టే అవకాశం ఉంది. గాయం తగ్గకపోతే ఐపీఎల్‌కి కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు