Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ హోమ్ వర్క్ చేస్తున్న హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్? - ఫొటోలు వైరల్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ బ్యాటింగ్ లోపాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ చేస్తున్నాడు. అది కాస్త వైరల్‌గా మారడంతో వైభవ్ హోం వర్క్‌ని రాహుల్ కంప్లీట్ చేస్తున్నాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

New Update
rahul dravid doing vaibhav suryavanshi homework

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) యువ బ్యాటర్, 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు అతడి గురించే చర్చ. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్‌ వేలంలో రూ.1 కోటి లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ యంగెస్ట్ ప్లేయర్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వైభవ్‌కు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఇక నిన్న గుజరాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ఈ చిచ్చర పిడుగు పరుగుల వర్షం కురిపించాడు. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అతి వేగంగా సెంచరీ సాధించిన రెండవ ప్లేయర్‌గా నిలిచాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టేశాడు. దీంతో T20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్నవయస్కుడిగా వైభవ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలా మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు రాబట్టాడు. అందులో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. అతడు సెంచరీ చేసిన తర్వాత హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఎగిరి గంతేశాడు. లెగ్ ఫ్రాక్చర్ ఉన్నా లెక్కచేయకుండా ఆనందంలో మునిగితేలిపోయాడు. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

హోం వర్క్ చేస్తున్న రాహుల్

అయితే సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ నోట్ బుక్‌లో ఏదో రాస్తున్నట్లు కనిపించాడు. బహుషా అది వైభవ్ బ్యాటింగ్‌ లోపాలను ఆ నోట్ బుక్‌లో రాసుకుని ఉండొచ్చు. అందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Also Read:  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తుంటే.. అతడి స్కూల్ హోమ్‌వర్క్‌ని కోచ్ రాహుల్ ద్రవిడ్ పూర్తి చేస్తున్నారని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వైభవ్ సూర్యవంశీ బీహార్‌‌లోని తాజ్‌పూర్‌లో ఉన్న డాక్టర్ ముక్తేశ్వర్ సిన్హా మోడెస్టీ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.

vaibhav-suryavanshi | Vigyan Vaibhav Exhibition 2025 | IPL 2025 | RR Vs GT

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు