/rtv/media/media_files/2025/10/18/pcb-2025-10-18-14-36-29.jpg)
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబర్‌లో జరగాల్సిన ట్రై-నేషన్ టీ20 సిరీస్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించింది. తమ దేశంపై పాక్ వైమానిక దాడులకు పాల్పడటంతో అఫ్గాన్ ఈ ట్రై సిరీస్ నుంచి వైదొలిగింది. అఫ్గాన్ లేకపోయినా షెడ్యూల్ ప్రకారం ట్రై సిరీస్ జరుగుతుందని పీసీబీ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ సిరీస్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ టోర్నమెంట్‌ను యథాతథంగా కొనసాగించడానికి పీసీబీ ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
శ్రీలంకతో పాటు మరొక దేశంతో ఆడతాం
శ్రీలంకతో పాటు మరొక దేశంతో ఆడతామని పాక్ క్రికెట్ బోర్డు చెబుతోంది. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య నవంబర్ 17 నుండి 29 వరకు ట్రై టీ20 సిరీస్ జరగాల్సి ఉంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ స్థానంలో వేరే జట్టు దొరకకపోతే, ఈ ట్రై-సిరీస్‌ను కేవలం పాకిస్తాన్, శ్రీలంక మధ్య ద్వైపాక్షిక (బైలేటరల్) టీ20 సిరీస్‌గా మార్చడానికి కూడా పీసీబీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రత్యామ్నాయ ప్రణాళికపై పీసీబీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ట్రై-సిరీస్‌కు ముందు, నవంబర్ 11 నుండి 15 వరకు పాకిస్తాన్ శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా ఆడనుంది.
AFGHANISTAN SHAMES PAKISTAN. 🚨
— Diplomatic Talk (@talk_prabhat) October 18, 2025
Afghanistan has officially withdrawn from the Tri-Series after Pakistan’s cowardly airstrikes on Afghan soil.
Sports may forgive, but nations don’t forget. pic.twitter.com/YNfyEY5Nhm
ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెటర్లతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) వెల్లడించింది. మరో ఏడుగురు గాయపడ్డారు. పాక్తికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాలో పాకిస్థాన్ వైమానిక దాడులు జరపగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. దాడుల్లో మరణించిన వారిలో కబీర్ ఆఘా, హరూన్, సిబ్ఘతుల్లా అనే ముగ్గురు క్రికెటర్లు ఉన్నారని ACB తెలిపింది. వీరు షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా, ఒకచోట ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఈ 'పిరికి దాడి' చేసిందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆరోపించింది.