GT Vs LSG: పొట్టు పొట్టు కొడుతున్న పూరన్, మార్క్‌రమ్.. విజయానికి చేరువలో లక్నో- 10 ఓవర్లలో ఎంత స్కోరంటే?

గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఛేజింగ్ అదరగొడుతోంది. 181 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జట్టు 10 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 114 పరుగులు సాధించింది. ఇంకా 60 బంతుల్లో 67 పరుగులు కొట్టాల్సి ఉంది. క్రీజ్‌లో పూరన్, మార్క్‌రమ్ ఉన్నారు.

New Update
Lucknow Super Giants vs Gujarat Titans LIVE Scorecard

Lucknow Super Giants vs Gujarat Titans LIVE Scorecard

గుజరాత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో లక్నో జట్టు ఛేజింగ్‌లో అదరగొడుతోంది. 181 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగింది. ప్రస్తుతం 10 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఈ పది ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 1 వికెట్ నష్టానికి 114 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో మార్క్‌రమ్ (50*), నికోలస్ పూరన్ (37*) ఉన్నారు. ఇంకా 60 బంతుల్లో 67 పరుగులు కొట్టాల్సి ఉంది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

గుజరాత్ పరుగులు

లక్నో సూపర్ జెయింట్స్ VS గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. ఇప్పుడు లక్నో ముందు 181 టార్గెట్ ఉంది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

గెలిస్తే ఫస్ట్‌కే

గుజరాత్ టైటాన్స్‌పై లక్నో జట్టు గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం లక్నో జట్టు ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు గుజరాత్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంటే లక్నో ఖాతాలోకి 8 పాయింట్లు వస్తాయి. అదేే సమయంలో మెరుగైన రన్‌రేట్‌ సాధిస్తే లక్నో జట్టు మొదటి స్థానానికి దూసుకెళ్తుంది. చూడాలి ఛేజింగ్‌లో లక్నో లక్ ఎలా ఉంటుందో.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(LSG vs GT | latest-telugu-news | telugu-news | IPL 2025 )

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు