KKR Vs CSK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్.. డూ OR డై మ్యాచ్ రెడీ

కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే బౌలింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

New Update
KKR VS CSK

ఐపీఎల్ 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇందులో భాగంగానే ఇవాళ 57వ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ సాగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే బౌలింగ్‌కు దిగనుంది. ఈ మ్యాచ్‌‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇదిలా ఉంటే కోల్‌కతా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఐదు మ్యాచ్‌లు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ వర్షం కారణంగా క్యాన్సిల్ అయింది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. అందులో రెండే విజయాలు సాధించింది. మిగిలిన 9 మ్యాచ్‌లు ఓడిపోయి ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

ఇది కూడా చూడండి: భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ఆయుష్ మ్హత్రే, ఉర్విల్ పటేల్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రీవిస్, రవిచంద్రన్ అశ్విన్, MS ధోని(w/c), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా. 

ఇది కూడా చూడండి: పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్స్:

శివమ్ దూబే, కమలేష్ నాగర్కోటి, రామకృష్ణ ఘోష్, జామీ ఓవర్టన్, దీపక్ హుడా

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, మొయిన్ అలీ, రమణదీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్‌లు:

హర్షిత్ రానా, అనుకుల్ రాయ్, లువ్నిత్ సిసోడియా, అన్రిచ్ నార్టే, మయాంక్ మార్కండే

telugu-news | latest-telugu-news | sports-news | csk-vs-kkr

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు