BIG BREAKING: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?

కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశారు. కానీ బీసీసీఐ దీనికి సమాధానం ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం.

New Update
rcb vs rr virat kohli

virat kohli

కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశాడు. కానీ బీసీసీఐ ఎలాంటి రిప్లై ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం. భారత్ జూన్ నుంచి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సమయంలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తే టీమిండియా కాస్త ఇబ్బంది పడుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే రోహిత్, రవీంద్ర జడేజా కూడా టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే రిటైర్మెంట్‌పై బీసీసీఐ, కోహ్లీ ఎవరూ ఇంకా స్పందించలేదు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు

ఇది కూడా చూడండి: Pakistan: 'మా రాజకీయ నేతల ఇళ్లపై దాడులు చేయండి'.. పాక్‌లో ప్రజల తిరుగుబాటు

ఇటీవల రోహిత్ శర్మ కూడా..

ఇదిలా ఉండగా ఇటీవలభారత సారథి రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టిన రోహిత్.. 67 టెస్టులాడి 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలుండగా అత్యధిక స్కోర్ 212 ఉంది. ఈ మేరకు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌తో వెళ్లాలని జాతీయ సెలెక్టర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్ గా రోహిత్ శర్మను తొలగించనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ విషయం ముందుగానే గమనించిన రోహిత్ టెస్టుల నుంచి పూర్తిగా తప్పుకంటున్నట్లు అనౌన్స్ చేసినట్లు సమాచారం. 38 ఏళ్ల రోహిత్ ఇప్పటికే T20లకు వీడ్కోలు పలకగా ఇక వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. 

ఇది కూడా చూడండి: IND-PAK WAR: వైమానిక దాడులు పగలు కాకుండా రాత్రే ఎందుకు జరుగుతాయి.. సీక్రెట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు