IPL 2025: ఐపీఎల్ కొత్త కెప్టెన్లు వీరే..ఒకే ఒక్క విదేశీ ఆటగాడు

కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ 2025 కళకళలాడనుంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఈ క్రికెట్ సమరానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ఐపీఎల్ కు సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ పూర్తయ్యాయి. కొత్త కెప్టెన్లు, కొత్త ఆటగాళ్లతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది.

New Update
list

IPL 2025

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) ముగిసంది. ఐపీఎల్ 2025 (IPL 2025) సందడి మొదలైంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ అయిపోయాయి. మెగావేలం తర్వాత టీమ్స్ అన్నీ కొత్తగా మారాయి...కెప్టెన్లు కూడా కొత్త వారు వచ్చారు. దీంతో ఐపీఎల్ 2025 కళకళలాడనుందని తెలుస్తోంది. ఈ సారి ఐపీఎల్ లో 10 జట్లు ఆడుతుండగా...అందులో తోమ్మది జట్లకు భారత ఆటగాళ్ళే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకే ఒక్క విదేశీ ఆటగాడు పాట్ కమిన్స్ మాత్రమే కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి ఐపీఎల్ లో యంగ్ బ్లడ్ అంతా కెప్టెన్సీకు సిద్ధమయ్యారు. వీరి నాయకత్వంలో పలువురు సీనియర్ ఆటగాళ్ళు కూడా ఆడనున్నారు. 

Also Read :  హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

టీమ్స్.. కెప్టెన్స్...

ముంబై ఇండియన్స్.. హార్దిక పాండ్యా..

గతేడాది నుంచే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సారి కూడా అతని కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ బరిలోకి దిగుతోంది. లాస్ట్ ఇయర్ అంత ప్రభావం చూపించలేకపోయిన హార్దిక్ ఈసారైనా కప్ గెలిపిస్తాడేమో చూడాలి.

Also Read :  SLBC టన్నెల్‌ డేంజర్ జోన్‌లోకి వెళ్లొద్దని రెస్య్కూ టీంకు ఆదేశాలు

చెన్నై సూపర్ కింగ్స్.. రుతురాజ్ గైక్వాడ్..

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ఈసారి కూడా  రుతురాజ్ గైక్వాడే నిర్వహించనున్నాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక...రుతురాజ్ రంగంలోకి వచ్చాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాట్ కమిన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్  జట్టుకు పాట్ కమిన్స్‌ను కెప్టెన్‌గా కొనసాగించింది. ఇతని కెప్టెన్సీలో లాస్ట్ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ కు చేరుకుంది. అందుకే ఈసారి కూడా ఇతన్నే కెప్టెన్ గా ఉంచారు.  అయితే ఈసారి ఈ జట్టులో బోలెడంత మంది కొత్త ఆటగాళ్ళు వచ్చారు.

కోల్‌కతా నైట్ రైడర్స్.. అజింక్య రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఈసారి కొత్త కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.  గత సీజన్‌లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, అప్పటి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు మారడంతో, రహానేకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..రజత్ పాటిదార్

ఆర్సీబీ జట్టుకు రజత్ పాటిదార్ ను కొత్త కెప్టెన్‌గా నియమించారు.  గత కొన్నేళ్లుగా ఆర్సీబీ తరఫున ఆడిన పాటిదార్, ఈ సారి కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించనున్నాడు. 

Also Read :  లొంగిపోండి.. కనీసం ప్రాణాలతో అయిన ఉంటారు: పుతిన్‌!

ఢిల్లీ క్యాపిటల్స్.. అక్షర్ పటేల్

నిన్ననే ఢిల్లీ క్యాపిటల్స్ తన కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.    ఆల్‌రౌండర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అక్షర్ పటేల్‌ ఈసారి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.  రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అక్షర్ మంచి ప్రతిభను చూపించాడు. 

పంజాబ్ కింగ్స్.. శ్రేయాస్ అయ్యర్

ఇంతకు ముందు కేకేఆర్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు  కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్.. అతన్ని కెప్టెన్‌గా ముందుగానే ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ కు గతంలో కప్ ను అందించాడు. 

రాజస్థాన్ రాయల్స్.. సంజూ సామ్సన్

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ సామ్సన్ కొనసాగనున్నాడు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ జట్టును నడిపిస్తున్న సంజూ 2025 సీజన్‌లో జట్టును ముందుకు తీసుకెళ్ళనున్నాడు. 

లక్నో సూపర్ జెయింట్స్..రిషబ్ పంత్

లక్నో సూపర్ జెయింట్స్  రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్‌ను 27 కోట్లకు కొనుగోలు చేసిన లక్నో టీమ్, అతనిపై భారీగా నమ్మకం పెట్టుకుంది. 

గుజరాత్ టైటాన్స్.. శుభ్‌మన్ గిల్

గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ వెళ్ళిపోయిన దగ్గర నుంచీ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2025 సీజన్‌లో అతని నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ మరింత మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. 

Also Read: USA: పాలస్తీనాకు మద్దతు..భారతీయ విద్యార్థిని వీసా రద్దు

Advertisment
Advertisment
తాజా కథనాలు