హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

హనీమూన్ సిస్టిటిస్ అనేది ఇంటర్ కోర్స్ తర్వాత సంభవించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)కి సంబంధించిన వ్యావహారిక పదం. ఇది మొదటిసారి లేదా చాలా కాలం తర్వాత ఇంటర్ కోర్స్ చేసే మహిళల్లో కనిపించే సర్వ సాధారమైన సమస్య. దీని గురించి మరిన్ని విషయాల కోసం ఆర్టికల్ చదవండి.

New Update
Honeymoon cystitis

Honeymoon cystitis

Honeymoon Cystitis: హనీమూన్ సిస్టిస్.. దీని గురించి ఎప్పుడైనా విన్నారా? కొత్తగా పెళ్లైన మహిళలు మరియు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు హనీమూన్ సిస్టిటిస్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇది సన్నిహిత భాగాల పరిశుభ్రతకు సంబంధించిన విషయం. కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు సన్నిహిత పరిశుభ్రతపై అవగాహన లేక తరచూ UTI సమస్యలను ఎదుర్కుంటారు. 

హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి?

హనీమూన్ సిస్టిటిస్ అనేది ఇంటర్ కోర్స్ తర్వాత సంభవించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)కి సంబంధించిన వ్యావహారిక పదం. ఇది మొదటిసారి లేదా చాలా కాలం తర్వాత ఇంటర్ కోర్స్ చేసే మహిళల్లో కనిపించే సర్వ సాధారమైన సమస్య. వివాహం తర్వాత యాక్టివ్ సెక్స్ సమయంలో చాలా మంది అమ్మాయిలు ఈ సమస్యను ఎదుర్కొంటారు. అందుకే దీనిని హనీమూన్ సిస్టిటిస్ అంటారు. దీని కారణంగా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం,  మూత్రనాళంలో బ్యాక్టీరియా ఉండిపోవడం జరుగుతుంది. తద్వారా  యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

హనీమూన్ సిస్టిటిస్ ఎందుకు వస్తుంది?

హనీమూన్ సిస్టిటిస్‌  (UTI) కారణం లైంగిక కార్యకలాపాలు పెరగడం. దీని వల్ల యానస్(Anus) లోని బ్యాక్టీరియా మూత్రనాళానికి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా అనిపించడం, తరచుగా మూత్రవిసర్జన చేయవలసి వస్తుంది. ఇంటర్ కోర్స్ తరువాత మూత్ర విసర్జన చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చే ప్రమాదం పెరుగుతుంది.


 ఎలా నివారించాలి

  • ఇంటర్ కోర్స్  తర్వాత మూత్ర విసర్జన తప్పనిసరిగా చేయాలి. 
  • సన్నిహిత భాగాల  పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
  • ఎక్కువసేపు మూత్రాన్ని నిలుపుకోవడం ద్వారా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. సకాలంలో మూత్ర విసర్జన చేయడం మంచిది. 
  • లోదుస్తుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎల్లప్పుడూ గాలి ఆడే ఫాబ్రిక్‌తో చేసిన లోదుస్తులను ఎంచుకోవాలి. తద్వారా మూత్రనాళం చర్మంపై ఘర్షణ ఉండదు. అలాగే సన్నిహిత భాగాల్లో చెమట పట్టకుండా చూసుకోవాలి. చెమట వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది.
  • ఎల్లప్పుడూ   హైడ్రేటెడ్ గా ఉండాలి.  వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది UTI సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.
  • మూత్ర విసర్జన సమయంలో మంట సమస్య రెండు రోజుల కంటే ఎక్కువ కొనసాగితే లేదా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

     

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్‌ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు