/rtv/media/media_files/2025/04/20/ub9IzN6XNLTzKpLHghrM.jpg)
BCCI good news to IPL fans
IPL 2025 Reschedule: IPL అభిమానులకు బీసీసీఐ(BBCI) గుడ్ న్యూస్ చెప్పింది. భారత్, పాక్ వార్ నేపథ్యంలో(India - Pakistan War) టోర్నీని వాయిదా వేయగా.. మరో వారం తర్వాత మ్యాచ్‌లు మళ్లీ నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది. మే 25న జరగనున్న ఫైనల్‌తో సహా ఇంకా 12లీగ్, 4 నాకౌట్ మ్యాచ్‌లకు కొత్త తేదీలు విడుదల చేయనుంది.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 9, 2025
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.
ఆటగాళ్ల ఆందోళన..
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ వారం పాటు వాయిదా పడింది. మే 8న పాక్ ఇండియాపై దాడులకు పాల్పడటంతో మే 9న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బీసీసీఐ రీ షెడ్యూల్ పై పునరాలోచన చేస్తోంది. ఆటగాళ్ల ఆందోళనలు, అభిమానుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే నిర్వహాణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ తెలిపింది. రీ షెడ్యూల్ లిస్ట్ త్వరలో విడుదల చేస్తామని వెల్లడించింది.
BIG BREAKING: IPL has been suspended only for One Week. BCCI coming out with new venues and schedule
— Vikrant Gupta (@vikrantgupta73) May 9, 2025
Breaking with all details on @sports_tak
Also Read: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO
దళాల సేవకు వందనం..
'ఐపీఎల్ వాటాదారులతో సంప్రదింపులు జరిపి తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మెజారిటీ ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల ఆందోళన, భావోద్వేగాలు, అభిమానుల అభిప్రాయాలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కీలక సమయంలో బీసీసీఐ దేశంతోనే ఉంటుంది. భారత ప్రభుత్వానికి, సాయుధ దళాలకు, మన దేశ ప్రజలకు మా మద్ధతు తెలియజేస్తున్నాం. దేశానికి సేవ చేసే వీరోచిత సాయుధ దళాల నిస్వార్థ సేవకు బోర్డు వందనం చేస్తోంది. దేశ సాయుధ దళాల బలం, సంసిద్ధతపై BCCI పూర్తి విశ్వాసం కలిగి ఉంది. సమిష్టి ప్రయోజనాల దృష్ట్యా వాయిదా వేసి, పరిస్థితులు అనుకూలించగానే మళ్లీ మిగిలిన మ్యాచ్ లు నిర్వహిస్తాం' అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక మే 25న కోల్‌కతాలో జరగనున్న ఫైనల్‌తో సహా ఐపీఎల్‌లో ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు, 4 నాకౌట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.
Also Read: ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
2021లోనూ ఐపీఎల్ సంక్షోభాన్ని ఎదుర్కొంది. కరోనా కాలంలో ఐపీఎల్ మ్యాచ్‌లను మధ్యలో ఆపాల్సి వచ్చింది. 2021 మే 2న వాయిదా వేసిన మ్యాచ్ లు మళ్లీ సెప్టెంబర్ 19 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో నిర్వహించారు.
Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
shedule | today telugu news