/rtv/media/media_files/2025/05/13/xP8Gj2i9dsJ9xSCxGi1y.jpg)
Indo-Pak war effect on RCB
IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్ కారణంగా ఐపీఎల్ 2025 వాయిదా పడింది. అయితే టోర్నీ రీ షెడ్యూల్ కారణంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న RCBకి ఊహించని షాక్ తగిలింది. ఈసారి కప్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న బెంగళూర్ టీమ్ ను ఒకవైపు గాయాలు వేధిస్తుంటే మరోవైపు స్టార్ ఆటగాళ్ల టైమ్ పీరియడ్ ముగియడంతో తిరిగి తమ దేశాలకు ప్రాతినిథ్యం వహించేందుకు వెళ్లిపోనున్నారు.
Qatar Airways Postcard 🎴✈️
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 13, 2025
Strategy mode: Reactivated! 👀🎮#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 @qatarairways pic.twitter.com/2pSouhey1P
Also Read : స్టూడెంట్‌తో కంప్యూటర్ టీచర్ రాసలీలలు.. ఇంట్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!
స్టార్ ప్లేయర్స్ ఔట్..
ఈ మేరకు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇప్పటికే గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో కెప్టెన్ ఎవరనేది తలనొప్పిగా మారింది. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాకు చెందిన ఆటగాళ్లు తమ దేశం వెళ్లిపోనున్నారు. మే 29నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్, జూన్ 11 నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య WTC ఫైనల్ జరగనుంది. దీంతో ఈ 4 దేశాలకు చెందిన ఆటగాళ్లు తర్వాతి మ్యాచ్‌లు ఆడకపోవచ్చు అనే అనుమానాలు బలంగా కనిపిస్తున్నాయి. వీరిలో ఆస్ట్రేలియా జోష్ హాజిల్‌వుడ్, ఇంగ్లాండ్ ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్ ఉండగా వెస్టిండీస్ నుంచి రొమారియో షెపర్డ్ ఆర్సీబీకి ఆడుతున్నారు. దీంతో ఆర్సీబీలో టిమ్ డేవిడ్ మినహా ఒక్క విదేశీ ఆటగాడు కూడా మిగిలే అవకాశం లేదు. శ్రీలంక పేసర్ నువాన్ తుషార ఉన్నా ఆడేది నమ్మకం లేదు.
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 13, 2025
Looking at the practice schedule ahead of our next game! 😎#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/znSJnLmJ9T
Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!
ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం..
ఈ సీజన్‌లో RCB ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం. ఇలాంటి సమయంలో స్టార్ ఆటగాళ్లు జట్టును వీడటం మేనేజ్ మెంట్ ను ఆందోళన పెడుతోంది. ఈసారి అంతా బాగుంది అనుకుంటే ఊహించని పరిణామంతో బెంగళూర్ కప్ కొట్టడం కష్టమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
RCB జట్టు:
ఐపీఎల్ వాయిదాకు ముందు ఆర్సీబీ జట్టు.. రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, స్వస్థిక్ చికారా, మయాంక్ అగర్వాల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రాఠీ, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాశ్ శర్మ, లుంగి ఎంగిడి, రసిఖ్ దార్ సలామ్, నువాన్ తుషార, అభినందన్ సింగ్.
Also Read: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!
రీ షెడ్యూల్:
ఇక మే 8న వాయిదా వేసిన టోర్నీ మే 17 నుంచి మళ్లీ మొదలుకానుంది. మే 8న 10 ఓవర్ల పాటు సాగిన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ 24న నిర్వహించనున్నారు. వేదికలు కూడా మారిపోయాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలు ఖరారు కావాల్సి ఉండగా జూన్ 3న ఫైనల్ జరిగే అవకాశం ఉంది.
Also Read : లుంగీలో పారిపోయిన మాజీ అధ్యక్షుడు..
Pakistan india War | telugu-news | today telugu news