/rtv/media/media_files/2025/05/13/1ULSB3vHl1dZOAeJswC0.jpg)
Abdul Hamid
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత యూనస్ నేత-ృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశం విడిచి భారత్‌లో ఉంటున్న షేక్ హసీనా అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. అయితే తాజాగా బంగ్లాదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పోరిపోయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లుంగీలోనే పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ను ప్రశ్నిస్తూ ఓవైసీ సంచలన ట్వీట్!
Former Bangladesh President Abdul Hamid
ఆయన థాయ్‌లాండ్ విమానం ఎక్కినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఈ వ్యవహారంపై యూనస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇదిలాఉండగా అబ్దుల్ హమీద్.. అవామీ లీగ్ విద్యార్థి విభాగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2013 నుంచి 2023 మధ్య షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు రెండుసార్లు అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టులో రిజర్వేషన్ అంశంలో విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
Also Read : కాలేయ ఆరోగ్యానికి జుట్టు రాలడానికి సంబంధం ఏంటి...?
అవామీ లీగ్ పాలనలో ఆందోళనకారులపై దాడులు, హత్య ఆరపోపణలపై యూనస్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. దీంతో ఈ ఏడాది జనవరిలో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్‌పై హత్య కేసు నమోదైంది. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలో ఉంటున్నాడు. అయితే గత వారమే ఆయన ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి థాయ్‌లాండ్ విమానం ఎక్కినట్లు వార్తలు వచ్చాయి. హమీద్ వెంట ఆయన సోదరుడు, బావ కూడా ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించిన దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. తెల్లవారుజామున 3 గంటలకు లుంగీలోనే హమీద్ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
Also Read: ఓరీడి రీల్స్ పిచ్చి తగలెయ్య.. కొంచెముంటే ప్రాణాలే పోయేవి కదరా! - వీడియో చూశారా?
మరోవైపు ఆయన వైద్య చికిత్స కోసం థాయ్‌లాండ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కానీ ఆయన కేసుల నుంచి తప్పించుకునేందుకే దేశం విడిచి పారిపోయాడని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ యూనస్ ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పార్టీ నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్ దర్యాప్తు పూర్తయ్యేవరకు నిషేధం కొనసాగుతోందని తెలిపింది.
Also Read : అది చేయకుంటే కాల్పుల విరమణ ఆగిపోతుంది.. భారత్‌ను హెచ్చరించిన పాక్
telugu-news | bangladesh | international | sheik-hasina