/rtv/media/media_files/2025/08/27/2030-cwg-bid-cleared-by-centre-2025-08-27-21-37-42.jpg)
India’s 2030 CWG bid cleared by Centre
ఇంటర్నేషనల్ క్రీడా పోటీలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించేందుకు భారత్ వేయాలనుకుంటున్న బిడ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదనలకు అంగకీరించింది. ఇంటర్నేషనల్ స్థాయి స్డేడియాలు, ట్రైనింగ్ సదుపాయాలకు అహ్మదాబాద్ సరైన వేదికని తెలిపింది.
Also Read: ప్రియురాలిలో రోమాన్స్... హఠాత్తుగా భర్త రావడంతో అతడేం చేశాడంటే..
ఇక వివరాల్లోకి వెళ్తే 2030 ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్‌ను నిర్వహించడం కోసం తాము ఎదురుచూస్తున్నామని గతేడాది మార్చిలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) కేంద్రానికి లేఖ పంపించింది. ఆ తర్వాత ఈ పోటీలు నిర్వహించేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికను కేంద్ర మంత్రిత్వ శాఖ ఖరారు చేసినట్లు ప్రచారం కూడా నడిచింది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు బిడ్లను దాఖలు చేయడం కోసం ఆగస్టు 31 తుది గడువుగా ఉంది. మొత్తానికి మరో 48 గంటల్లో దీనికి సంబంధించిన కార్యాచరణ అంతా IOA పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
Also read: మనుషులు కాదు క్రూరమృగాలు.. యువతిని కిడ్నాప్ చేసి 6 నెలలుగా గ్యాంగ్ రేప్
2010లో భారత్ ఆతిథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఈ క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటికే ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2036లో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్‌కు కూడా ఆతిథ్యం ఇచ్చేందుకు భారత ప్రభుత్వం రెడీ అయిపోయింది. 2036 ఒలింపిక్స్ టార్గెట్‌గా కేంద్రం సన్నహాలు ప్రారంభించినట్లు కేంద్ర హోం మంత్రి అమత్ షా కూడా ఇటీవల చెప్పారు. దీనికోసం 3 వేల మంది క్రీడాకారులకు ఒక్కొక్కరికి ప్రతీనెల రూ.50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 2036లో జరగబోయే ఒలింపిక్స్ గేమ్స్‌లో టాప్ 5లో రావడమే భారత్ లక్ష్యమని తెలిపారు.