Rohith Sharma: టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణమిదే.. మొదటిసారి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ!

మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఆడటం సవాల్‌తో కూడుకున్నదని రోహిత్ శర్మ ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పడం వెనుక కారణం ఇదే ఉందని తెలుస్తోంది.

New Update
Rohith Sharma

Rohith Sharma

టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు అకస్మాత్తుగా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ఐదు రోజుల పాటు మానసికంగా అలసిపోవడం వల్ల టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినట్లు పరోక్షంగా తెలిపారు. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ ఆడటం సవాల్‌తో కూడుకున్నదని రోహిత్ శర్మ ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పడం వెనుక కారణం ఇదే ఉందని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ అప్పటి వరకు ఇంగ్లాండ్ పర్యటన కోసం సిద్ధమయ్యారు. ఒక్కసారిగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని రోజులకే విరాట్ కోహ్లీ కూడా  ప్రకటించారు. అయితే వీరిద్దరూ వీటికి గల కారణాలు ఏంటనే విషయం చెప్పకుండా రిటైర్మెంట్ ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: భారీ సిక్సు కొట్టి గుండెపోటుతో చనిపోయాడు..VIDEO VIRAL

ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో పాల్గొన్న..

రోహిత్ శర్మ ఇటీవల ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో టెస్ట్ క్రికెట్ ఆడటం చాలా కష్టమన్నారు. మానసికంగా అలసిపోతామని, టెస్ట్ క్రికెట్‌కు ఎంతో ఓపిక అవసరమన్నారు. ఐదు రోజుల పాటు ఆడటం మానసికంగా కష్టమని రోహిత్ శర్మ ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. అయితే రోహిత్ శర్మ రెండు లేదా మూడు రోజుల పాటు జరిగే ముంబై క్లబ్‌లో మ్యాచ్‌లు ఆడారు. చిన్న వయస్సు నుంచే ఈ ఫార్మాట్‌పై ఆడటం అలవాటు ఉంది. కానీ మానసికంగా బాగా అలసిపోవడంతోనే అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: India-Pakistan: 'రెండు మ్యాచ్‌లు మేమే గెలుస్తాం, ఇన్షా అల్లాహ్'.. పాకిస్థాన్ బౌలర్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరుసగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నిర్ణయించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన పర్యటనకు ముందు వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. గిల్ కెప్టెన్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ సిరీస్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే కెప్టెన్‌గా బుమ్రాను బీసీసీఐ నియమిస్తుందని కొందరు భావించారు. కానీ బీసీసీఐ చివరకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించి రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. 

Advertisment
తాజా కథనాలు