/rtv/media/media_files/2025/08/27/wife-cheates-husband-2025-08-27-21-17-23.jpg)
Wife Cheates Husband
Wife Cheats Husband: ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల అనుబంధాలకంటే వివాహేతర సంబంధాలే ఎక్కువవుతున్నాయి.భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య మరోకరితో ఎఫైర్ నడిపిస్తున్నారు. ఇకవేళ అక్రమ సంబంధాలు బయటపడితే భర్తను భార్య, భార్యను భర్త చంపడం సాధారణమై పోయింది. దీంతో ఎన్నో కాపురాలు కుప్పకూలుతున్నాయి. వివాహేతర సంబంధాల నేపథ్యంలో భర్తలనే చంపేస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. తాజాగా పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికే పిలిచింది. ఇద్దరు మంచి రోమాన్స్‌లో ఉన్న సమయంలో హఠాత్తుగా భర్త ఇంటికి వచ్చాడు దీంతో మొత్తం కథ అడ్డం తిరిగింది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియని కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..ఓ వివాహిత తన భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలసి ఏకంతంగా రోమాన్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కాలింగ్ బెల్ మోగింది. ఆ సమయంలో ఎవరు వచ్చారా అని ఆలోచించింది. పదే పదే కాలింగ్ బెల్ మోగుతుండటంతో వచ్చింది తన భర్తే అని ఆ మహిళ నిర్ధారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రియుడు ఒంటిపై బట్టలు లేకుండా ఉండటంతో ఆమెకు మరింత టెన్షన్ పెరిగింది. ఈ క్రమంలో ఏం చేయాలో అర్థం కాక ఆమె తలపట్టుకుంది. డోర్ తీయడానికి సంకోచించింది. అయితే తన భార్య ఎన్నిసార్లు బెల్ కొట్టిన డోర్ తీయకపోయేప్పటికీ భర్తకు అనుమానం వచ్చింది.
Also Read: పైసలకు కక్కుర్తి పడి కత్తులకు పని.. సిజేరియన్‌లో పుట్టిన పిల్లలకు భయంకరమైన వ్యాధులు!
స్పైడర్ మాన్ లా దూకుతూ..
ఈ లోపు ఇంట్లో ఉన్న లవర్ తన ప్రియురాలి భర్తకు దొరకకూడదన్న ఉద్దేశంతో అక్కడినుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒంటిపై డ్రాయర్‌తో అపార్ట్‌మెంట్ బాల్కానీలోకి వచ్చి అక్కడి నుంచి దూకడానికి ప్రయత్నించాడు. ఈ లోపు అమె భర్త గమనించి వాడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో బాల్కనీ నుంచి మరో బిల్డింగ్ పైకి చేరి అక్కడినుంచి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఇదంతా గమనిస్తున్న స్థానికులు ఈ తతంగాన్నంతా వీడియో తీశారు. అతన్ని దొంగగా భావించిన స్థానికులు పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. చివరికి పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఔరా అనుకున్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి:AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!