/rtv/media/media_files/2025/08/27/gang-rape-2025-08-27-20-23-06.jpg)
23-Year-Old Odisha Woman Alleges Six-Month Abduction, Gang-Rape After Escape
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది యువకులు క్రూరమృగాల్ల ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో ఓ యువతిని బంధించి ఏకంగా 6 నెలల పాటు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం కలకలం రేపింది. ఎట్టకేలకు అక్కడి నుంచి తప్పించుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలాసోర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతిని అక్కడి స్థానిక వ్యక్తి ఈ ఏడాది మార్చిలో కిడ్నాప్ చేశాడు.
Also Read: పంజాబ్ ను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన స్కూల్..400 మంది పిల్లలు వరద నీటిలో..
ఆమెను మయూర్భంజ్ జిల్లాలోని బారిపడకు తీసుకెళ్లి అక్కడ ఓ ఇంట్లో ఉంచారు. అయితే గత ఆరు నెలల నుంచి ఆ యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేస్తూనే ఉన్నారు. చివరికి ఆ యువతి వాళ్ల నుంచి తప్పించుకుంది. ఆగస్టు 26న తనకు ఇన్నాళ్లు జరిగిన దారుణం గురించి భోగ్రై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ యువతిని బాలసోర్‌లో పునరావాస కేంద్రానికి తరలించారు. బుధవారం ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేశారు.
Also Read: పరారీలో మలయాళ నటి లక్ష్మీ మేనన్.. కిడ్నాప్ కేసులో ఆమె పేరు
ఇదిలాఉండగా తన కూతురు ఓ వ్యక్తితో పారిపోయినట్లు ఈ ఏడాది మార్చి 3న ఆ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూ.3 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు పేర్కొంది. దీంతో ఈ కేసుపై అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు గాలిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: వీడు పోలీసు కాదు..రాక్షసుడు..వరకట్నం కోసం భార్యకు నిప్పంటించిన పోలీస్