/rtv/media/media_files/2025/08/05/team-india-2025-08-05-09-11-54.jpg)
Team India Schedule
ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సీరీస్ ను భారత్ సమం చేసింది. ఈ పెద్ద విజయం తర్వాత టీమ్ ఇండియా ఒక నెల విరామం తీసుకోనుంది. దాని తర్వాత వరుసపెట్టి మ్యాచ్ లు ఆడనుంది. దాని తాలూకా షెడ్యూల్ ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. వచ్చే ఏడాది టీ 20 వరల్డ్ కప్ వరకు భారత జట్టు షెడ్యూల్ మొత్తాన్ని బీసీసీఐ ప్రకటించింది.
Also Read : ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు.. టీమిండియా విజయోత్సవ సంబరాలు చూశారా?
వరుస సీరీస్ లతో బిజిబిజీగా..
ఆగస్టులో అవ్వాల్సిన బంగ్లాదేశ్ పర్యటన 2026కు వాయిదా పడింది. దీంతో టీమ్ ఇండియాకు ఆగస్టు నెల అంతా విశ్రాంతి దొరికింది. దీని తరువాత భారత జట్టు యూఏఈలో జరగనున్న ఆసియా కప్ లో ఆడుతుంది. దీని తరువాత వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికాలతో వరుస టెస్ట్ సిరీస్ లు ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో వన్డే, టీ20 సీరీస్ లు ఆడ్డానికి ఆస్ట్రేలియా వెళ్ళనుంది. ఇవన్నీ అయ్యాక టీ20 వరల్డ్ కప్ ముందు సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తో వైట్ బాల్ హోమ్ సీరీస్ ను టీమ్ ఇండియా ఆడనుంది. ఇక యూఏఈలో జరిగే ఆసియాకప్ లో మెన్ ఇన్ బ్లూ జట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో ఆడుతుంది. ఇందులో పాకిస్తాన్ తో మూడు మ్యాచులు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్ లు చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాయి. మొత్తం మీద, భారతదేశం 2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వరకు 22-31 T20Iలు ఆడనుంది, వాటిలో T20 ప్రపంచ కప్‌కు ముందు 18-22 ఉన్నాయి. టెస్ట్ మ్యాచ్ లు అన్నింటికీ శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇక వన్డేల కోసం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులోకి రానున్నారు. మొత్తానికి టీమ్ ఇండియా 2026 టీ20 ప్రపంచ కప్ ముగిసే వరకు భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, 9 వన్డేలు మరియు 20 కి పైగా టీ20లు ఆడనుంది.
Also Read : Mohammed Siraj : చరిత్ర సృష్టించిన సిరాజ్... కపిల్ దేవ్ రికార్డు బద్దలు
today-latest-news-in-telugu | bcci | latest-telugu-news | telugu-news | telugu-sports-news | telugu-cricket-news | T20 WC 2026