IND vs NZ : న్యూజిలాండ్ చిత్తు.. వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా విక్టరీ!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ 2016లో లాగే 2026లో మరోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 

New Update
india (4)

India Won 2026 World Cup

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium) లో న్యూజిలాండ్ తో జరిగిన టీ 20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 255 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్(new-zealand)  కేవలం 159 పరుగులకే పరిమితం అయింది. దీంతో టీమిండియా 96 పరుగులతో ఘన విజయం సాధించింది. కివీస్ ఆటగాళ్లలో టిమ్ సీఫెర్ట్ (52) ఒక్కటే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ సాంట్నర్ (43) పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా,  అక్సర్ పటేల్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా,వరుణ్ తలో వికెట్ తీశారు. - ind-vs-nz

ఇండియా టీ 20వరల్డ్ కప్ గెలుచుకోవడం ఇది మూడోసారి కావడం విశేషం. 2007లో ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా చిన్న వరల్డ్ కప్ టోర్నీలు సాధించగా.. ఇప్పుడు మూడోసారి ముచ్చటగా మూడోసారి సూర్య కెప్టెన్సీలో కప్ ను ముద్దాడింది. పాపం న్యూజిలాండ్ 2016లో లాగే 2026లో మరోసారి రన్నరప్ తో సరిపెట్టుకుంది. 

Also Read :  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ చెత్త రికార్డు!

Also Read :  ఇషాన్ కిషాన్ సూపర్ క్యాచ్.. కవీస్ సగం వికెట్లు డౌన్!

Advertisment
తాజా కథనాలు