IND vs NZ : ఇషాన్ కిషాన్ సూపర్ క్యాచ్.. కవీస్ సగం వికెట్లు డౌన్!

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది

New Update
ishan

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చలాయిస్తున్నారు. 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  హార్దిక్ పాండ్యా వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన మార్క్ చాప్‌మన్ (3), అది ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 70 పరుగుల వద్ద కివీస్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది.  ఇషాన్ కిషన్ మరోసారి తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న సీఫెర్ట్ (52) వికెట్‌ను తీయడంలో ఇషాన్ పట్టిన సూపర్ క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ స్కోరు 83/5గా ఉంది. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ ఉన్నారు. అంతకుముందు భారత్ 5 వికెట్ల నష్టానికి  255 పరుగులు చేసింది. 

Advertisment
తాజా కథనాలు