IND vs PAK : ఇండియా vs పాకిస్థాన్ .. త్వరలో ఏకంగా మూడు మ్యాచ్లు!

 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.  ఆసియా ఖండంలోని జట్ల మధ్య జరిగే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది.  

New Update
ind  vs pak

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ (Champions Trophy Tournament) లో పాకిస్థాన్ కథ ఐదు రోజుల్లోనే  ముగిసింది. న్యూజిలాండ్, భారత్ చేతిలో ఘోర ఓటములు, బంగ్లాదేశ్ తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ తో పాక్ ఇంటి దారి పట్టింది.  దీంతో  ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మొదటి ఆతిథ్య దేశంగా పాక్ అవతరించింది.  

Also Read :  కాలర్లు పట్టుకొని పొట్టు పొట్టు తన్నుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేసిన క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి.  ఆసియా ఖండంలోని జట్ల మధ్య జరిగే ఆసియా కప్ ఈ ఏడాది జరగబోతోంది.  సెప్టెంబర్ రెండో వారం నుంచి నాలుగో వారం వరకు ఆసియా కప్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.  2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఆసియాకప్ ను టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read :  మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తటస్థ వేదికలో ఆసియా కప్

2025  ఆసియా కప్ (Asia Cup 2025) కు భారత్ ఆతిథ్యమివ్వాల్సి ఉంది.  ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్ కు వెళ్లలేదు కాబట్టి..  ఆసియా కప్ కోసం పాక్ ఇండియాకు వచ్చే అవకాశం లేదు. దీంతో  తటస్థ వేదికలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్లాన్ చేస్తోంది.  శ్రీలంక లేదా యూఏఈలో ఈ టోర్నీ జరిగే అవకాశముంది. బీసీసీఐనే హోస్ట్ గా ఉంటుంది.

Also Read :  Kedar దగ్గర సినీ పెద్దల బ్లాక్ మనీ.. ఆ వేల కోట్లు ఎక్కడ.. వారందరిలో హైటెన్షన్!

అన్ని కుదిరితే భారత్, పాక్ జట్లు మూడు సార్లు తలబడే అవకాశం ఉంది. ముందుగా గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో, చివరగా ఫైనల్ చేరితే అక్కడ కూడా ఇరు జట్లు తలబడాల్సి ఉంటుంది.  2023 ఆసియా కప్ లో భారత్, పాక్ మూడు సార్లు తలపడేలా షెడ్యూల్ రూపొందించారు. కానీ గ్రూప్ దశలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. సూపర్-4లో పాక్ ను భారత్ చిత్తు చేసింది.  ఫైనల్ లో శ్రీలంకను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. 

Also Read :  కాలర్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న బీజేపీ నేతలు.. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు