/rtv/media/media_files/2025/02/27/KIZMmXbdaKByRfCYxekd.jpg)
Rajasthan BJP leaders' full-blown fight caught on camera
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఇద్దరు బీజేపీ నేతల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఒకరి చొక్కా కాలర్లు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎదురుగానే ఒకరిపై మరోకరు చెంప దెబ్బలతో వాయించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: గోవాలో పర్యాటకులు సంఖ్య ఎందుకు తగ్గిందంటే ?.. స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం జైపూర్‌లోని బీజేపీ మైనార్టీ మోర్చా మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ మదన్ రాథోడ్, ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో మదన్ రాథోడ్‌ను వేదిక పైకి తీసుకెళ్లేందుకు మైనార్టీ విభాగం నేత జాకీ యత్నించారు. కానీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జావేద్ ఖురేష్ ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది.
Also Read: ఎన్నికల కమిషన్ ముందు దీక్ష చేస్తా.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
దీంతో ఆ బీజేపీ నేతలు జావేద్ ఖురేషి, జాకీ ఒకరి కాలర్లు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఇతర నేతలు, కార్యకర్తల ముందే ఫైట్ చేసుకోవడం కలకలం రేపింది. చివరికీ ఇతర నేతలు జోక్యం చేసుకుని వాళ్లిద్దరి ఫైట్‌ను ఆపారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
VIDEO | A ruckus broke out between members of BJP's minority front during a meeting at party office in Jaipur earlier today. More details awaited.
— Press Trust of India (@PTI_News) February 27, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/CkeCguxUMw
Also Read: మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
Also Read: వీడ్ని పట్టుకుంటే రూ.లక్ష మీ సొంతం.. పోలీసుల సంచలన ప్రకటన