/rtv/media/media_files/2026/02/15/india-pakistan-match-2026-02-15-09-39-52.png)
India Pakistan match
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్(india vs pakistan final match) మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్‌తో నేడు సూపర్ సండే కానుంది. అయితే దీనిని ఎక్కడ ఫ్రీగా చూడాలి అనేది తెలుసుకుందాం.
Also Read : AUS VS ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన జింబాబ్వే !
ఫ్రీగా ఎక్కడ చూడాలి
భారత్, పాకిస్తాన్(ind-vs-pak) మధ్య మ్యాచ్ ఇవాళ శ్రీలంకలోని ఆర్. ప్రేమ్‌దాస క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు 6.30 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్‌ను టీవీలో లైవ్‌లో చూడాలనుకుంటే.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో చూడొచ్చు. అలాగే జియో హాట్‌స్టార్‌లో కూడా వీక్షించవచ్చు. దీన్ని యాప్‌లో లేదా వెబ్ సైట్‌లో నచ్చిన భాషల్లో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొలంబో నుండి జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్.. విల్లో టీవీ, స్కై స్పోర్ట్స్, సూపర్‌స్పోర్ట్‌తో సహా ప్రధాన నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంది.
భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడాలనుకుంటే కేవలం టీవీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్ టీవీ ఛానెల్‌లో చూడగలరు. దీనికోసం ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. కాగా భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తుండగా, పాకిస్థాన్‌కు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహిస్తున్నారు.
Also Read : ఆంధ్రా బౌలర్లను ముప్పుతిప్పలు.. 299 పరుగుల వద్ద ఔట్.. ఎవరీ సుదీప్ కుమార్?
భారత్ ప్లేయింగ్ 11: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ , శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్
పాకిస్థాన్ ప్లేయింగ్ 11: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ తారిఖ్, అబ్రార్ అహ్మద్.
Follow Us